- Home
- Sports
- Cricket
- WTC Finals 2023: ఆప్షన్స్ లేవు హార్ధిక్.. వచ్చేయ్.. గుజరాత్ కెప్టెన్‌కు గాలం వేస్తున్న బీసీసీఐ!
WTC Finals 2023: ఆప్షన్స్ లేవు హార్ధిక్.. వచ్చేయ్.. గుజరాత్ కెప్టెన్‌కు గాలం వేస్తున్న బీసీసీఐ!
WTC Finals 2023: జూన్ 7 నుంచి 11 వరకు ది ఓవల్ (ఇంగ్లాండ్) వేదికగా జరుగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో భారత్ కు గాయాల బెడద వేధిస్తున్నది.

Image credit: Getty
పదేండ్ల తర్వాత ఐసీసీ టోర్నీ నెగ్గడానికి భారత్ కు మంచి అవకాశం దొరికినా దానిని సాధించేందుకు దారులు మాత్రం మూసుకుపోతున్నాయి. కీలక బ్యాటర్లు అంతా గాయాల బారీన పడుతున్నారు. ఇప్పటికే రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లు గాయాల కారణంగా శస్త్రచికిత్స చేయించుకోగా తాజాగా ఈ జాబితాలో మరో ఆటగాడు చేరాడు.
మిడిలార్డర్ లో భారత కీలక ఆటగాడు కెఎల్ రాహులో ఆరు రోజుల క్రితం ఆర్సీబీతో మ్యాచ్ లో గాయపడి ఐపీఎల్ -16తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాహుల్ రిప్లేస్మెంట్ ను వెతకాల్సిన పని సెలక్టర్ల మీద పడింది.
Image credit: PTI
రాహుల్ స్థానంలో ఇప్పటికే భారత జట్టుకు ఆడుతున్న పలువురు ఆటగాళ్లు పేర్లు వినిపిస్తున్నా ఆల్ రౌండర్ ను తీసుకుంటే మంచిదన్న అభిప్రాయంలో సెలక్టర్లు ఉన్నారు. టీమ్ లో ఇప్పటికే శార్దూల్ ఠాకూర్ రూపంలో ఓ ఆల్ రౌండర్ ఉన్నా అతడి మీద నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి. ప్రస్తుతం ఐపీఎల్ -16లో కూడా శార్దూల్ అంతగొప్ప ప్రదర్శనలేమీ చేయలేదు.
Image credit: PTI
కెఎల్ రాహుల్ ప్లేస్ లో గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను తీసుకుంటే ఎలా ఉంటుందని బీసీసీఐ పెద్దలు లెక్కలేసుకుంటున్నారు. హార్ధిక్ ఉంటే టీమ్ లో మరో పేసర్ కూడా దొరికినట్టే. అదీగాక రీఎంట్రీలో పాండ్యా దుమ్మురేపుతున్నాడు. భావి భారత సారథిగా కూడా ఎదుగుతున్నాడు. రాహుల్ ప్లేస్ ను హార్ధిక్ కు ఇవ్వడమే బెటర్ అన్న నిర్ణయానికి కూడా సెలక్షన్ కమిటీ వచ్చినట్టు సమాచారం.
సెలక్టర్ల ఆలోచన, నిర్ణయం బాగానే ఉన్నా హార్ధిక్ పాండ్యా ఇందుకు సమ్మతిస్తాడా..? అన్నది అనుమానంగా ఉంది. జనవరి, ఫిబ్రవరిలలో భారత్.. శ్రీలంక, న్యూజిలాండ్ తో సిరీస్ లు ఆడినప్పుడు కూడా విలేకరులు పాండ్యాను ఇదే ప్రశ్న అడిగారు. అన్ని ఫార్మాట్లలో మీరు ఎంట్రీ ఇచ్చినట్టేనా..? బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో ఆడతారా..? అని ప్రశ్నలు సంధించారు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో కూడా ఫస్ట్ వన్డేకు సారథ్యం వహించిన పాండ్యాకు ఇదే ప్రశ్న ఎదురైంది. అప్పుడు పాండ్యా.. తాను విలువలకు కట్టుబడే మనిషినని, అసలు భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు సాధించడంలో వన్ పర్సెంట్ కూడా కంట్రిబ్యూషన్ లేని తాను ఇప్పుడు హఠాత్తుగా వచ్చి బాగా ఆడుతున్నాననే కారణంగా మరొకరి ప్లేస్ ను లాగేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పాడు.
తన దృష్టి మొత్తం బ్లూ (వన్డే, టీ20) మీదే ఉందని వైట్ (టెస్టు) జెర్సీకి ఇంకా సమయముందని చెప్పాడు. మరి ఈ ఒట్టును తీసి హార్ధిక్ గట్టున పెడతాడా..? రాహుల్ స్థానాన్ని భర్తీ చేస్తాడా..? అన్నది ఆసక్తికరంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు సమయం దగ్గరపడుతుండటంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.హార్ధిక్ ఒప్పుకోకుంటే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లకు అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఇద్దరి కంటే ఆల్ రౌండర్ గా సేవలందించే పాండ్యా అయితేనే భారత్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.