- Home
- Sports
- Cricket
- ఫామ్‌లో లేడని విరాట్ కోహ్లీని తప్పించగలరా? అజింకా రహానే విషయంలో మాత్రం... ఆశీష్ నెహ్రా కామెంట్..
ఫామ్‌లో లేడని విరాట్ కోహ్లీని తప్పించగలరా? అజింకా రహానే విషయంలో మాత్రం... ఆశీష్ నెహ్రా కామెంట్..
సౌతాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్టు కోసం భారత జట్టు సిద్ధమవుతున్న వేళ, నెం.5 బ్యాట్స్‌మెన్‌గా ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. శ్రేయాస్ అయ్యర్‌తో పాటు అజింకా రహానే, హనుమ విహారి ఈ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు...

గత మూడేళ్లుగా సరైన ఫామ్‌లో లేని అజింకా రహానే, గత ఏడాది సరిగ్గా బాక్సింగ్ డే రోజున జరిగిన మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయాడు...
ఈ ఏడాది 19.57 సగటుతో పరుగులు చేసిన అజింకా రహానే, పేలవమైన ఫామ్ కారణంగా టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ కూడా కోల్పోవాల్సి వచ్చింది...
అదీకాకుండా న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆరంగ్రేటం చేసిన శ్రేయాస్ అయ్యర్, మొదటి టెస్టులోనే సెంచరీతో అదరగొట్టాడు. దీంతో రహానే ప్లేస్ ప్రమాదంలో పడింది...
అజింకా రహానేతో పాటు ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ కూడా ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అయితే ఈ ఇద్దరి ప్లేస్‌పై అనుమానాలు లేవు...
‘ఐదో స్థానంలో ఎవరిని ఆడించాలనేది నిర్ణయించడం నిజంగా చాలా కష్టంగా మారనుంది. గాయాల కారణంగా కొందరు ప్లేయర్లు దూరమైనా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందనేది చెప్పడం కష్టంగా మారింది...
కేవలం గణాంకాల కారణంగా తుది జట్టును నిర్ణయించాలని అనుకుంటే, విరాట్ కోహ్లీ గత ఏడాదిన్నరగా సెంచరీ చేయలేకపోయారు. స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా ఇవ్వడం లేదు...
అయితే ఫామ్‌లో లేడని విరాట్ కోహ్లీని తప్పించాలని చెబుతారా? పూజారా కూడా సరైన ఫామ్‌లో లేడు. దాదాపు మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోయాడు...
అయితే పూజారా ప్లేస్‌కి ఢోకా లేదు. ఇక మిగిలింది రహానే. అజింకా రహానే ప్లేస్ మాత్రం ప్రమాదంలో ఉంది. కాన్పూర్ టెస్టులో అజింకా రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు...
రెండో టెస్టుకి విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇవ్వడంతో రహానేకి తుదిజట్టులో ప్లేస్ కూడా దక్కలేదు. సౌతాఫ్రికాతో ఐదుగురు, లేదా ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో బరిలో దిగాలని టీమిండియా భావిస్తే, రహానేకి ప్లేస్ దక్కడం అనుమానమే...
విరాట్ కోహ్లీకి ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కొత్తేమీ కాదు. చాలాసార్లు ఇలాంటి ఛాలెంజ్‌లను అవకాశాలుగా మార్చుకున్నాడు కోహ్లీ... రహానే కూడా అంతే...
సౌతాఫ్రికాలో జోహన్‌బర్గ్, కేప్ టౌన్ పిచ్‌ల మీద బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉంటుంది. గత పర్యటనలో ఈ పిచ్‌లపై భారత బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడ్డారు.
కెఎల్ రాహుల్, ఆరు నెలలకి ముందు టెస్టు టీమ్‌లో కూడా లేడు, ఇప్పుడు అతన్ని వైస్ కెప్టెన్‌ని చేశాడు. అతని అనుభవం ఉంది, కానీ ఇంత త్వరగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్‌లకు పెద్దగా టెస్టులు ఆడిన అనుభవం లేదు. అయితే ఇప్పుడు క్రికెట్ ఆటతీరే మారిపోయింది. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా...