- Home
- Sports
- Cricket
- ఇండియాలో వరల్డ్ కప్ గెలవడం మాకు చాలా తేలికైన విషయం.. పాక్ ప్లేయర్ షాదబ్ ఖాన్ కామెంట్స్..
ఇండియాలో వరల్డ్ కప్ గెలవడం మాకు చాలా తేలికైన విషయం.. పాక్ ప్లేయర్ షాదబ్ ఖాన్ కామెంట్స్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వన్ ఆఫ్ ది ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది పాకిస్తాన్. భారత్‌లోని పిచ్, వాతావరణం, పరిస్థితులు పాక్‌కి అనుకూలంగా ఉండడంతో పాటు పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా చూపిస్తున్న నిలకడైన ప్రదర్శన కూడా దీనికి కారణం..

Shadab Khan
1992 వన్డే వరల్డ్ కప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన పాకిస్తాన్ టీమ్, ఆ తర్వాత 1999 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయింది. 2011 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో భారత్ చేతుల్లో ఓడింది పాకిస్తాన్..
Shadab Khan
2015 వన్డే వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్‌లో ఓడిన పాకిస్తాన్ జట్టు, 2019 వన్డే వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజ్ కూడా దాటలేకపోయింది. ఈసారి ఐసీసీ నెం.1 వన్డే బ్యాటర్ బాబర్ ఆజమ్ సూపర్ ఫామ్‌లో ఉండడం పాకిస్తాన్‌ని టైటిల్ ఫెవరెట్లలో ఒకటిగా నిలబెట్టింది..
‘ఇండియాలో వరల్డ్ కప్ గెలవడం మాకు నల్లేరు మీద నడకే. ఇండియాకి వచ్చే ప్రతీ టీమ్, వరల్డ్ కప్ గెలవాలనే ఉద్దేశంతోనే వస్తుంది. అయితే మాకు ఈసారి కొడతామని చాలా నమ్మకం ఉంది...
ప్రతీ టీమ్‌పై ఎలా గెలవాలో ఓ ప్రణాళిక రూపొందించుకున్నాం. ఒకే టోర్నీలో అన్నీ టాప్ టీమ్స్‌తో ఆడడం చాలా గొప్ప అవకాశం. మాకు ఇండియాలో ఫ్యాన్స్ సపోర్ట్ ఉండదు. ఆ విషయం మాకు తెలుసు. అదే మాకు అతి పెద్ద అడ్వాంటేజ్..
ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగడం కంటే పెద్ద ఎనర్జీ బూస్టర్ ఏముంటుంది. విరాట్ కోహ్లీని అవుట్ చేయడానికి స్పెషల్ ప్లాన్స్ ఏమీ వేసుకోలేదు. అందరికీ కలిపి ఒకే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలు చేయబోతున్నాం..’ అంటూ కామెంట్ చేశాడు పాక్ ఆల్‌రౌండర్ షాదబ్ ఖాన్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది..