ఇదేం కెప్టెన్సీ గబ్బర్... చాహాల్‌కి బౌలింగ్ ఇవ్వకపోవడంపై అజిత్ అగార్కర్ ఆగ్రహం...
వెస్టిండీస్ టూర్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి వన్డే సిరీస్‌ని సొంతం చేసుకుంది భారత జట్టు. హోరాహోరాగా దాదాపు 50 ఓవర్ల పాటు సాగిన రెండు వన్డేల్లోనూ భారత జట్టుని విజయం వరించింది. కెప్టెన్‌గా శిఖర్ ధావన్ పాస్ మార్కులే కొట్టేశాడు...

వెస్టిండీస్ టూర్‌లో వన్డే సిరీస్ గెలిచిన ఐదో భారత కెప్టెన్‌గా నిలిచాడు శిఖర్ ధావన్. ఇంతకుముందు విరాట్ కోహ్లీ రెండు సార్లు వెస్టిండీస్‌లో వన్డే సిరీస్ గెలవగా,మహేంద్ర సింగ్ ధోనీ, సౌరవ్ గంగూలీ, సురేష్ రైనా... వన్డే సిరీస్ గెలిచిన కెప్టెన్లుగా ఉన్నారు. తాజాగా శిఖర్ ధావన్‌కి ఈ లిస్టులో చోటు దక్కింది...
Image credit: PTI
అయితే భారత ప్రధాన స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌ని ఆఖరి అస్త్రంగా వాడాడు శిఖర్ ధావన్. 9 ఓవర్లు వేసిన యజ్వేంద్ర చాహాల్, ఒక్క వికెట్ తీసి 69 పరుగులిచ్చి అత్యధిక పరుగులిచ్చిన భారత బౌలర్‌గా నిలిచాడు..
Image credit: PTI
‘ఎందుకని యజ్వేంద్ర చాహాల్‌ని ఆఖర్లో బౌలింగ్‌కి తీసుకొచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఏ టైమ్‌లో బౌలింగ్ ఇచ్చినా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వడం చాహాల్ స్పెషాలిటీ...
Yuzvendra Chahal
అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం యజ్వేంద్ర చాహాల్‌ని సఫారీ బ్యాటర్లు ఈజీగా ఆడేసుకున్నారు. ఇన్నింగ్స్ ఆఖర్లో బౌలింగ్‌కి రావడం వల్ల వికెట్లు తీయాలనే ఆతృతలో చాహాల్ తప్పులు చేసి, ఎక్కువ పరుగులు సమర్పించాడు...
క్రీజులో సెటిల్ అయిన బ్యాటర్లకు బౌలింగ్ చేయడం అంత తేలికైన పని కాదు. కొన్నిసార్లు క్రీజులో కుదురుకుపోయిన బ్యాటర్లకు బౌలింగ్ చేసినప్పుడు ఎలాంటి బౌలర్ అయినా భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి ఉంటుంది.
Image credit: Getty
యజ్వేంద్ర చాహాల్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. వెస్టిండీస్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడగలరు. అందుకే ఒకటి,రెండు వికెట్లు పడిన తర్వాత చాహాల్‌కి బాల్‌ని అందించి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేది...
మిడిల్ ఓవర్లలో యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌కి వచ్చి ఉంటే పొదుపుగా బౌలింగ్ చేసేవాడు. వికెట్లు కూడా తీసేవాడు... మరి ధావన్ కెప్టెన్సీ ఏంటో నాకైతే అర్థం కావడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్..