- Home
- Sports
- Cricket
- కోచ్ పొజిషన్‌లో రాహుల్ ద్రావిడ్ ఉన్నా, ఏం చేయలేకపోతున్నాడు... ఆశీష్ నెహ్రా కామెంట్స్...
కోచ్ పొజిషన్‌లో రాహుల్ ద్రావిడ్ ఉన్నా, ఏం చేయలేకపోతున్నాడు... ఆశీష్ నెహ్రా కామెంట్స్...
సౌతాఫ్రికా టూర్‌లో సెంచూరియన్ టెస్టులో టీమిండియా విజయం సాధించినా... సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా నుంచి ఆశించిన ఇన్నింగ్స్‌లు మాత్రం రాలేదు. ఛతేశ్వర్ పూజారా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు...

తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరిన ఛతేశ్వర్ పూజారా, రెండో ఇన్నింగ్స్‌లో 64 బంతులాడి 3 ఫోర్లతో 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...
తొలి ఇన్నింగ్స్‌లో 48 పరుగులు చేసి అవుటైన అజింకా రహానే, రెండో ఇన్నింగ్స్‌లో 23 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
‘సెంచూరియన్ టెస్టులో అజింకా రహానేకి చోటు దక్కడమే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. శ్రేయాస్ అయ్యర్ ఫామ్‌లో ఉన్నా, అతన్ని పక్కనబెట్టి రహానేకి అవకాశం ఇచ్చారు...
సీనియర్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం మంచిదే. అజింకా రహానే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బాగానే రాణించాడు, కాబట్టి తర్వాతి టెస్టులోనూ అతనికి అవకాశం రావచ్చు...
విజయాలు వస్తున్నంత కాలం ప్లేయర్లకు అవకాశం ఇవ్వడంలో తప్పులేదు. రహానే, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీలకు తమ పరిస్థితి అర్థమై ఉండొచ్చు...
కచ్ఛితంగా పరుగులు చేయాల్సిన స్థితిలో ఉన్నామని కూడా వాళ్లు తెలుసుకున్నారు. ఎక్కువ టెస్టులు ఆడాలనుకుంటే, పరుగులు చేయాలని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు...
విరాట్ కోహ్లీ సంగతి వేరు. అతను క్రీజులో సెటిల్ అయిన తర్వాత 20, 30, 40 పరుగులు చేసిన తర్వాత అవుట్ అవుతున్నాడు. అది కూడా ఒకేలా...
హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌లాంటి డిఫెన్స్ టెక్నిక్ తెలిసిన ప్లేయర్ అందుబాటులో ఉన్నా, విరాట్ కోహ్లీ విషయంలో ఆయన ఏం చేయలేకపోతున్నారు...
ఈ ముగ్గురు ప్లేయర్లను త్వరలోనే ద్రావిడ్ తన దారిలోకి తెచ్చుకుంటాడని అనుకుంటున్నా. మొదటి రోజు సౌతాఫ్రికా బౌలర్ల ప్రదర్శన నన్ను నిరుత్సాహపరిచింది...
అయితే ఆ క్రెడిట్ కెఎల్ రాహుల్‌కి ఇవ్వాల్సిందే. ఇంతకుముందు చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్న రాహుల్, వాటిని పునరావృత్తం కాకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు...
కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలతోపాటు మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ రూపంలో ఓపెనింగ్ ప్లేస్‌కి బాగా పోటీ ఉంది.
కాబట్టి తన క్లాస్ బ్యాటింగ్‌తో మిగిలిన ఇద్దరికంటే ముందుండాలని రాహుల్ ఫిక్స్ అయినట్టు ఉన్నాడు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా...