- Home
- Sports
- Cricket
- రూల్ బ్రేక్ చేస్తే, భజ్జీ ఫైన్ వేయడం మొదలెట్టాడు, అలా వారిని దారిలోకి తెచ్చాడు... యువరాజ్ సింగ్ కామెంట్...
రూల్ బ్రేక్ చేస్తే, భజ్జీ ఫైన్ వేయడం మొదలెట్టాడు, అలా వారిని దారిలోకి తెచ్చాడు... యువరాజ్ సింగ్ కామెంట్...
అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్, 2019-20 సీజన్‌లో పంజాబ్ తరుపున దేశవాళీ క్రికెట్ ఆడాడు. పంజాబ్ జట్టుకి మెంటర్‌గా వ్యవహారించిన యువరాజ్ సింగ్, కుర్రాళ్లను మెరుగులు దిద్దేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చాడు...

భారత జట్టులో చోటు దక్కించుకున్న శుబ్‌మన్ గిల్‌తో పాటు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వంటి చాలామందికి యువరాజ్ సింగ్ మెంటర్‌గా వ్యవహారించాడు. పంజాబీ క్రికెటర్ల ఇంగ్లీష్ యాస్‌పై చాలా విమర్శలు వచ్చేవి...

అయితే యువరాజ్ సింగ్ మాత్రం పర్ఫెక్ట్‌గా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. భారత జట్టుకి ఎంపికైన తర్వాత అంతర్జాతీయ వేదికలపై ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వస్తుంది. దాంతో తన టీమ్‌లోని కుర్రాళ్లకు బ్యాటింగ్ టెక్నిక్‌లతో పాటు ఇంగ్లీష్ పాఠాలు కూడా నేర్పించేవాడట యువీ...

‘నేను కోచ్‌గా ఎంత కాలం ఉండగలనో తెలీదు. ఎందుకంటే నేను వేరే వృత్తిలోకి మారిపోవచ్చు. అయితే కుర్రాళ్లతో కలిసి పనిచేయడం నాకెప్పుడూ ఇష్టమే. నాకు నచ్చిన యంగ్ క్రికెటర్లను నేను ఎంచుకుంటా...

నేను ఎంచుకున్న క్రికెటర్లతో నెల లేదా రెండు నెలలు గడుపుతాను. వారి గేమ్ గురించి సాధన చేస్తూనే, వారి భాష విషయంలో కూడా కేర్ తీసుకుంటా. ముఖ్యంగా భవిష్యత్తులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకుంటే స్టేజ్ మీద ఎలా మాట్లాడుతారో అడిగి తెలుసుకుంటూ ఉంటా...

అయితే వాళ్లు చెప్పే సమాధానం పూర్తిగా ఇంగ్లీష్‌లో ఉండాలి... అయితే పంజాబీ ప్లేయర్లు ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడేవాళ్లు. వింత వింత సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉండేవాళ్లు...

కుర్రాళ్లు కావాలనే తప్పించుకుంటున్నారని గ్రహించిన హర్భజన్ సింగ్, ‘ఇంగ్లీష్ డే’ అని ప్రతీ ఆదివారం ఓ స్పెషల్ సెషన్ ఏర్పాటు చేశాడు. ఆ రోజు ప్రాక్టీస్‌లో, నెట్స్‌లో ప్రతీ చోటా ప్లేయర్లు ఇంగ్లీషులో మాట్లాడాల్సిందే...

ఎవ్వరైనా ఈ రూల్ బ్రేక్ చేసి పంజాబీలో మాట్లాడినా, హిందీలో పలకరించినా రూ.1000 ఫైన్ కట్టాలి... దెబ్బకి పంజాబ్ ప్లేయర్లు మొత్తం దారిలోకి వచ్చారు. ఇప్పుడు చాలామంది పంజాబీ ప్లేయర్లు మాతృభాష కంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్.

2017లో చివరిసారిగా భారత జట్టు తరుపున ఆడిన యువరాజ్ సింగ్, 2019లో అంతర్జాతయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఆ తర్వాత రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో సిక్సర్ల మోత మోగించి అదరగొట్టిన యువీ, అంతర్జాతీయ క్రికెట్‌లోకి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావించాడు.

అయితే అప్పటికే విదేశీ లీగుల్లో పాల్గొనడంతో బీసీసీఐ, యువరాజ్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనను తిరస్కరించింది. హర్భజన్ సింగ్ కూడా ఐదేళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.