క్రిస్ గేల్ చేసిన పనికి షాకైన విరాట్ కోహ్లీ... వచ్చాడు, కళ్లు మూసి తెరిచేలోపు...
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 2011 నుంచి 8 సీజన్ల పాటు ఆర్‌సీబీకి ఆడిన క్రిస్ గేల్, ఆ తర్వాత నాలుగు సీజన్లలో పంజాబ్ కింగ్స్ ఆడాడు. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి క్రికెట్‌కి దూరంగా ఉంటున్న క్రిస్ గేల్.. ఐపీఎల్ 2023 సీజన్‌లో కామెంటేటర్‌గా కనిపించబోతున్నాడు...

Image credit: Getty
ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందు క్రిస్ గేల్, ఏబీ డివిల్లియర్స్‌ని తిరిగి తీసుకొచ్చిన ఆర్‌సీబీ, మొదటి మ్యాచ్ ఆరంభానికి ముందు వారిని ఘనంగా సత్కరించబోతోంది. ఐదేళ్ల తర్వాత ఆర్‌సీబీతో కలిసిన క్రిస్ గేల్, కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టాడు...
Chris Gayle
‘విరాట్ కోహ్లీతో బ్యాటింగ్ చేయడం చాలా మజాగా ఉంటుంది. అతనికి క్రికెట్ అంటే పిచ్చి. విరాట్ పర్ఫామెన్స్‌లను లెక్కబెట్టేందుకు ఈ గణాంకాలు సరిపోవు. అవన్నీ కనిపించేవి మాత్రమే.. అతని డెడికేషన్ వెలకట్టలేనిది...
విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌తో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడాన్ని చాలా ఎంజాయ్ చేశా. ఆర్‌సీబీలో ఉన్న టైమ్.. ఎప్పుడూ ఫన్నీగా, ఉత్సాహంగా ఉండేది. ఎప్పుడూ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ ఉండేవాళ్లం...
విరాట్ కోహ్లీకి కొన్ని డ్యాన్స్ స్టెప్పులు నేర్పించా. అతనికి డ్యాన్స్ చేయడమంటే చాలా ఇష్టం. కానీ ఇండియన్ డ్యాన్స్ చేసేటప్పుడు క్రిస్ గేల్ గెలుస్తాడు, కరేబియన్ డ్యాన్స్ చేసేటప్పుడు కూడా క్రిస్ గేలే గెలుస్తాడు...
ఆర్‌సీబీలో నాకు బాగా గుర్తున్న విషయం. ఓ సీజన్‌లో విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. నేను కూడా బాగానే ఆడాను కానీ అతను నాకంటే 100-150 పరుగులు ఎక్కువగా చేశాడు... అయితే ఒకే మ్యాచ్‌లో నేను అతన్ని దాటేశా...
ఆ మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చి.. ‘నేను ఎంత బాగా ఆడుతున్నా... ఇతను ఇలా వచ్చాడు, అలా అలా బాంగ్ బాంగ్ బాంగ్... బాదేశాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయ్యాడు...’ అని ఆశ్చర్యపోతూ అన్నాను. నాకు ఆ విషయం ఇప్పటికీ బాగా గుర్తుంది...
చాలామంది క్రిస్ గేల్ వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తలేడు అంటారు.. అయితే విరాట్‌తో బ్యాటింగ్ చేసేటప్పుడు నాకు బాగా ఉరికించేవాడు. అందుకే నాకు అతనితో ఆడడం భలే ఇష్టం. మేం ఇద్దరం కలిసి 10 సార్లు 100 ప్లస్ భాగస్వామ్యం నెలకొల్పాం...
ఆ భాగస్వామ్యాల్లో ఎన్నిసార్లు డబుల్స్ తీశామో, ఇంకెన్నిసార్లు త్రిబుల్స్ తీశామో మీ ఊహకే వదిలేస్తున్నా. కాబట్టి నేను వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తగలను.. ఆ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి డౌట్స్ అవసరం లేదు..’ అంటూ చెప్పుకొచ్చాడు క్రిస్ గేల్..