- Home
- Sports
- Cricket
- సిరాజ్ తిట్టాడని కోహ్లీకి కంప్లైంట్ చేసిన జేమ్స్ అండర్సన్... 600 వికెట్లు తీస్తే, నువ్వేమైనా తోపువా...
సిరాజ్ తిట్టాడని కోహ్లీకి కంప్లైంట్ చేసిన జేమ్స్ అండర్సన్... 600 వికెట్లు తీస్తే, నువ్వేమైనా తోపువా...
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రాటుతేలిన ప్లేయర్లలో మహ్మద్ సిరాజ్ ఒకడు. కెరీర్ ప్రారంభంలో భారీగా పరుగులు సమర్పించిన సిరాజ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్...

Image credit: Getty
మూడేళ్ల క్రితం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 టోర్నీలో టెస్టు ఆరంగ్రేటం చేసిన మహ్మద్ సిరాజ్, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాకి కీ బౌలర్‌గా మారబోతున్నాడు. జస్ప్రిత్ బుమ్రా గాయపడడంతో షమీ, సిరాజ్‌లపైనే ఆశలు పెట్టుకుంది భారత జట్టు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇప్పటికే లండన్ చేరిన సిరాజ్, 2021 ఇంగ్లాండ్ పర్యటనలో జేమ్స్ అండర్సన్‌తో జరిగిన గొడవ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు కామెంట్ చేశాడు..
Virat Kohli and James Anderson
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు, మొదటి 4 టెస్టుల్లో 2 విజయాలు అందుకుని ఓ మ్యాచ్ ఓడి 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. మొదటి టెస్టు వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దయింది కానీ అది జరిగి ఉంటే 3-1 తేడాతో సిరీస్ గెలిచి ఉండేది...
ఈ పర్యటనలో జస్ప్రిత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్‌ని టార్గెట్ చేశారు ఇంగ్లాండ్ టీమ్. ఇంగ్లాండ్ టార్గెట్ చేసిందనేకంటే మనవాళ్లే, ఇంగ్లాండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌ని టార్గెట్ చేసి, మానసికంగా వేధించడంలో పైచేయి సాధించారని చెప్పడం కరెక్ట్...
లార్డ్స్ టెస్టులో జస్ప్రిత్ బుమ్రా బౌన్సర్లతో జేమ్స్ అండర్సన్‌ని ఇబ్బంది పెట్టాడు. దీంతో బుమ్రా బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు ఇంగ్లాండ్ బౌలర్లు తిరిగి ఇవ్వాలని చూశారు. ఇది టీమిండియాకి కోపాన్ని తెప్పించింది. ఫలితం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ పేకమేడలా కూలి, భారత జట్టుకి చారిత్రక విజయం...
‘నేను, జస్ప్రిత్ బుమ్రా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జేమ్స్ అండర్సన్ నా దగ్గరికి వచ్చి ఏదో తిట్టాడు. నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే నేను అతన్ని తిట్టేశాను...
అతను బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు నువ్వు 600 వికెట్లు తీసి ఉండొచ్చు అయితే ఎవరికి తోపు. నువ్వంటే నాకు ఎలాంటి గౌరవం లేదని అన్నాను. ఆ మాటలకు అతను చాలా బాధపడ్డాడు. వెంటనే వెళ్లి విరాట్ కోహ్లీకి కంప్లైంట్ చేశాడు...
విరాట్ భాయ్ వెంటనే నువ్వు ఎందుకు వాడితో పెట్టుకున్నావ్ అన్నాడు. అక్షర్ పటేల్, రిషబ్ పంత్ కూడా నాతో కలిసి అండర్సన్‌ని టార్గెట్ చేశారు. ఆ సిరీస్‌లో చాలా ఎంజాయ్ చేశాం...’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ సిరాజ్..
ఆ సిరీస్‌లో జరగాల్సిన నిర్ణయాత్మక ఐదో టెస్టు, కరోనా కారణంగా వాయిదా పడి 2022 జూన్‌లో జరిగింది. జస్ప్రిత్ బుమ్రా ఈ టెస్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ టెస్టులో నెగ్గిన ఇంగ్లాండ్ 2-2 తేడాతో సిరీస్‌ని సమం చేసింది..