IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ కు వర్షం విలన్ అవుతుందా?
IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ vs బంగ్లాదేశ్ మ్యాచ్ ఫిబ్రవరి 20 (గురువారం) మధ్యాహ్నం 2.30 గంటలకు దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, నెట్‌వర్క్ 18 ఛానెల్‌లలోప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

Champions Trophy
India vs Bangladesh: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో తమ తొలి మ్యాచ్ కోసం రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు సిద్ధమైంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ లో భారత జట్టు తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టిస్ చేసింది. ఇటీవల ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ గెలిచిన జోష్ లో ఉన్న భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను విజయంతో ప్రారంభించాలని చూస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం విలన్ కావచ్చని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి.
టీమిండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ కు వర్షం అడ్డుపడుతుందా?
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వర్షం కురిసే అవకాశముంది. కొంత సమయం వర్షం పడినా పిచ్ ప్రభావం ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా టీమిండియా తన ప్రణాళికను మార్చుకోవలసి ఉంటుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి భారత జట్టులో 5 మంది స్పిన్నర్లు ఉన్నారు. వారిలో ముగ్గురితో భారత జట్టు బంగ్లాదేశ్‌తో ఆడవచ్చు. కానీ దుబాయ్ నగరంలో వర్షం ఒక అద్భుతం లాంటిది కాబట్టి భారతదేశం ఈ ప్రణాళికను మార్చుకోవలసి రావచ్చు. ఇక్కడ తరచుగా కృత్రిమ వర్షం కురిపిస్తారు. ఫిబ్రవరి 20న దుబాయ్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Image Credit: Getty Images
ఛాంపియన్స్ ట్రోఫీకి ఒక రోజు ముందు అంటే ఫిబ్రవరి 18న భారీ వర్షం కురిసింది. నగరమంతా తడిగా కనిపించింది. అదే సమయంలో ఫిబ్రవరి 20 కి సంబంధించి వాతావరణ శాఖ నుండి అప్ డేట్ అందింది. ఆ రోజు కూడా వర్షం కురిసే అవకాశాలున్నాయి. ఈ వర్షం మ్యాచ్ కు అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. భారీ వర్షం పడకపోయినా ఫిబ్రవరి 20న కొంత సమయం అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Rohit Sharma
బంగ్లాదేశ్ పై టీమిండియాదే పై చేయి
భారత్-బంగ్లాదేశ్ జట్లు 41 వన్డే మ్యాచ్‌లు ఆడాయి. ఈ మ్యాచ్‌లలో భారత జట్టు 32 విజయాలు సాధించగా, బంగ్లాదేశ్ జట్టు 8 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ జట్టు వన్డే ఫార్మాట్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడింది. అందులో 5 విజయాలు సాధించగా, ఒక మ్యాచ్ టై అయింది. దుబాయ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయాన్ని సాధించి, తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది.
Bangladesh team. (Photo - ICC X/@ICC)
భారత్-బంగ్లాదేశ్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ జట్లు
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్ , కేఎల్ రాహుల్ , రిషబ్ పంత్ , హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్ , కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్. షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా , వరుణ్ చకరవర్తి.
బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హుస్సేన్, తస్కిన్ పర్జ్వే అహ్మద్, హోస్మాన్ పర్జ్వే, ముస్తాఫ్ అహ్మద్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, నహిద్ రాణా.