MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2022: రాసిపెట్టుకోండి.. ఈసారి కప్ మనదే.. కోల్కతా ఫ్యాన్స్ కు ప్రామిస్ చేసిన కొత్త కెప్టెన్

IPL 2022: రాసిపెట్టుకోండి.. ఈసారి కప్ మనదే.. కోల్కతా ఫ్యాన్స్ కు ప్రామిస్ చేసిన కొత్త కెప్టెన్

Shreyas Iyer Big Promise To KKR Fans: ఐపీఎల్ లో ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ కు కొత్త కెప్టెన్ గా ఎంపికైన  శ్రేయస్ అయ్యర్.. ఆ జట్టు అభిమానులకు భారీ హామీనిచ్చాడు. ఈసారి ఏదేమైనా కప్ కొట్టడం ఖాయమని...

2 Min read
Author : Srinivas M
Published : Feb 28 2022, 07:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

కోల్కతా నైట్ రైడర్స్ కు ఇటీవలే  కొత్త సారథిగా ఎంపికైన  శ్రేయస్ అయ్యర్.. ఆ జట్టు అభిమానులకు బిగ్ ప్రామిస్ చేశాడు. ఈసారి  ఛాంపియన్షిప్ (ఐపీఎల్) గెలవడమే తన లక్ష్యమని.. దానిని  నెరవేరుస్తానని  అభిమానులకు హామీ ఇచ్చాడు.  

210

ఐపీఎల్-15 సీజన్ ప్రారంభానికి కొద్దిరోజులకు ముందు.. అయ్యర్ కోల్కతా అభిమానులతో ఆ జట్టు లక్ష్యాల గురించి వివరించాడు.  ఇందుకు సంబంధించిన వీడియోను  కోల్కతా.. తన యూట్యూబ్ ఛానెల్ లో పంచుకుంది.

310

ఈ సందర్బంగా అయ్యర్ మాట్లాడుతూ.. ‘ఈసారి నేను కోల్కతాకు సారథ్యం వహిస్తున్నాననే భావన ఎంతో ఉత్సాహంగా ఉంది. కోల్కతా అభిమానులందరిని కలవడానికి నేను ఎంతగానో వేచి చూస్తున్నా..  మీరంతా (అభిమానులు) మమ్మల్ని  ఉత్సాహపరుస్తుండటం కోసం నేను వేచి చూస్తున్నా.. 

410

నేను ఆటగాళ్ల కెప్టెన్ గా ఉండాలనుకుంటున్నా. మనందరం ఒక  నిర్దిష్టమైన లక్ష్యం వైపునకు ప్రయాణిస్తున్నాం. దానిని తప్పక అందుకుంటామని నాకు నమ్మకముంది. ఈసారి మనం  (కేకేఆర్)  ఛాంపియన్షిప్ ను గెలుచుకుంటామని  నేను  మీకు హామీ ఇస్తున్నాను..’అని అన్నాడు. 

510

ఇంకా అయ్యర్ మాట్లాడుతూ... ‘కెప్టెన్సీ విషయంలో నాకు స్పష్టమైన ఆలోచన ఉంది. గతంతో పోలిస్తే   నిర్ణయాలు తీసుకోవడంతో పాటు  నాయకత్వ లక్షణాల విషయంలో నేను కొంత అనుభవం గడించాను.  

610

కేకేఆర్ లో వివిధ దేశాల నుంచి విభిన్న సంస్కృతుల నుంచి వచ్చిన ఆటగాళ్లున్నారు. వాళ్లందరితో కలిసి పనిచేసేందుకు నేను ఉత్సాహంగా వేచి చూస్తున్నాను. 

710

వేలంలో కేకేఆర్ మొదట్నుంచి నాకోసం వెళ్లింది. ఇతర పెద్ద ఫ్రాంచైజీలు కూడా నాకోసం పోటీలోకి వచ్చినా వదలకుండా  నన్ను దక్కించుకుంది. వేలం సందర్భంగా  మేమంతా (టీమిండియా ఆటగాళ్లు) కలిసి టీవీల ముందు అతుక్కుపోయాం. నా పేరు వచ్చినప్పుడు నేను నా భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. పైకి కామ్ గా ఉండటానికి ప్రయత్నించినా.. లోపల టెన్షన్ మాత్రం చాలా ఉంది..’ అని చెప్పాడు. 

810

వేలంలో కేకేఆర్ మొదట్నుంచి నాకోసం వెళ్లింది. ఇతర పెద్ద ఫ్రాంచైజీలు కూడా నాకోసం పోటీలోకి వచ్చినా వదలకుండా  నన్ను దక్కించుకుంది. వేలం సందర్భంగా  మేమంతా (టీమిండియా ఆటగాళ్లు) కలిసి టీవీల ముందు అతుక్కుపోయాం. నా పేరు వచ్చినప్పుడు నేను నా భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. పైకి కామ్ గా ఉండటానికి ప్రయత్నించినా.. లోపల టెన్షన్ మాత్రం చాలా ఉంది..’ అని చెప్పాడు. 

910

కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ తో పనిచేయడానికి తాను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని   అయ్యర్ చెప్పాడు.  అతడు ఎంతో అగ్రెసివ్ గా ఉంటాడని.. న్యూజిలాండ్ తరఫునే గాక  ఐపీఎల్ లో కూడా బ్రెండన్  దూకుడుగా ఆడటాన్ని ఎవరూ మరిచిపోలేదని అలాంటి వ్యక్తితో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంతో ఉన్నానని అయ్యర్ అన్నాడు.

1010

గత సీజన్ లో సారథిగా ఉన్న ఇయాన్ మోర్గాన్ ను ఈసారి రిటైన్ చేసుకోని కేకేఆర్.. ఈనెల  12న జరిగిన వేలంలో  అయ్యర్ ను దక్కించుకుంది.  వేలంలో అయ్యర్‌ రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. ఇక ఫిబ్రవరి 16న, అతడిని తమ కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది.

About the Author

SM
Srinivas M
Latest Videos
Recommended Stories
Recommended image1
Shivam Dube : రైలులో ఇలా వస్తాడని ఊహించలేదు.. వరల్డ్ కప్ హీరో సీక్రెట్ జర్నీ
Recommended image2
Sun Risers : సన్‌రైజర్స్ లోకి పాక్ ప్లేయర్.. ఎందుకు కావ్యా ఇలా చేశావు? రచ్చ స్టార్ట్ !
Recommended image3
SRH : సన్‌రైజర్స్ కావ్యా మారన్ షాకింగ్ డెసిషన్.. పాక్ ప్లేయర్‌కు రూ. 2.34 కోట్లు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved