- Home
- Sports
- Cricket
- 2003 వన్డే వరల్డ్ కప్‌లో ఎవరు ఓపెనింగ్ చేయాలని అడిగితే, గంగూలీ తప్ప అందరిదీ ఒకే మాట... - వీరేంద్ర సెహ్వాగ్..
2003 వన్డే వరల్డ్ కప్‌లో ఎవరు ఓపెనింగ్ చేయాలని అడిగితే, గంగూలీ తప్ప అందరిదీ ఒకే మాట... - వీరేంద్ర సెహ్వాగ్..
ఎలాంటి అంచనాలు లేకుండా 2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీని ప్రారంభించింది టీమిండియా. ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ఓడిన టీమిండియా, మళ్లీ ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ చేతుల్లోనే ఓడింది. మిగిలిన అన్ని మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుంది..

Sachin Sehwag Ganguly
2003 వన్డే వరల్డ్ కప్ గురించి, అంతకుముందు 2002లో లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ షర్ట్ విప్పి చేసుకున్న విన్నింగ్ సెలబ్రేషన్స్ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలను బయటపెట్టాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..
నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ విధించిన 325 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి ఓవర్‌లో ఛేదించింది టీమిండియా. మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీలతో రాణించగా ఆఖరి వికెట్‌గా వచ్చిన జహీర్ ఖాన్ విన్నింగ్ షాట్ కొట్టాడు..
‘దాదా ఆ రోజు షర్ట్ లేకుండా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం అతను అండర్‌గార్మెంట్స్ ఎండార్స్‌మెంట్ డీల్ కావాలని కోరుకోవడమే...’ అంటూ సరదాగా కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్..
‘ముంబైలో ఆండ్రూ ఫ్లింటాఫ్, ఇండియాపై గెలిచాక ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నాడు. అతనికి సరైన సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతోనే గంగూలీ అలా చేశాడు..’ అంటూ క్లారిటీ ఇచ్చాడు వీరూ...
‘2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో మాకు కావాల్సిన ఆరంభం దక్కలేదు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఓడిపోయాం. దీంతో కోచ్ జాన్ రైట్, ఎవరితో ఓపెనింగ్ చేయించాలని టీమ్ మొత్తాన్ని అడిగాడు...
నేరుగా సమాధానం చెప్పడానికి ధైర్యం సరిపోకపోతే మీ సలహాలను చిట్టీల్లో రాసి ఇవ్వమని అడిగాడు. 11 చిట్టీల్లో ఒక్క దాంట్లో మాత్రమే సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీ అని రాసి ఉంది. అది రాసింది కూడా గంగూలీయే...
మిగిలిన వారంతా సచిన్ టెండూల్కర్- వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనింగ్ చేయాలని రాశారు. అప్పటి నుంచి నేను, సచిన్ పాజీ ఓపెనింగ్ చేయడం మొదలెట్టాం. దాదా మూడో స్థానానికి వచ్చాడు..’ అంటూ చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్..
సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీ కలిసి వన్డేల్లో 6609 పరుగులు జోడించి, అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా టాప్‌లో ఉన్నారు. సచిన్ టెండూల్కర్- వీరేంద్ర సెహ్వాగ్ కలిసి 3919 పరుగులు జోడించారు.