- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీ ఇప్పుడు కూడా వాళ్ల కంటే బాగా ఆడుతున్నాడు... మాజీ కెప్టెన్‌కి అజారుద్దీన్ సపోర్ట్...
విరాట్ కోహ్లీ ఇప్పుడు కూడా వాళ్ల కంటే బాగా ఆడుతున్నాడు... మాజీ కెప్టెన్‌కి అజారుద్దీన్ సపోర్ట్...
భారత క్రికెట్ ఫ్యాన్స్‌ని ఎక్కువగా కలవరబెడుతున్న విషయం విరాట్ కోహ్లీ ఫామ్. రెండేళ్ల క్రితం వరకూ అసాధారణమైన బ్యాటింగ్‌తో పరుగుల వరద పారిస్తూ, రన్ మెషిన్‌లా దూసుకుపోయిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు సెంచరీ మార్కు అందుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు...

Image credit: PTI
ఐపీఎల్ 2022 సీజన్‌లోనూ విరాట్ కోహ్లీ 300+ పరుగులు చేసినా, టాపార్డర్‌లో వేగంగా పరుగులు చేయలేకపోయాడు. ఇది ఆర్‌సీబీ ఓటమికి ఓ కారణంగా మారింది...
ఐపీఎల్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ టూర్‌లో జరిగే ఐదో టెస్టు నుంచి తిరిగి క్రీజులోకి రాబోతున్నాడు...
Virat Kohli
‘విరాట్ కోహ్లీ 50+ స్కోర్లు చేస్తున్నా కూడా అతను ఫెయిల్ అయినట్టుగా చూస్తున్నారు. అవును, అతను ఈ ఏడాది పెద్దగా ఆడలేకపోయాడు. అయితే ప్రతీ ఒక్కరి కెరీర్‌లో ఇలాంటి బ్యాడ్ ఫేజ్ కామన్...
సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ కూడా ఇలాంటి పరిస్థితులను ఫేస్ చేసిన వాళ్లే. విరాట్ కోహ్లీ ఇప్పటికే చాలా క్రికెట్ ఆడేశాడు. ఇప్పటికీ ఆడుతున్నాడు... ఎప్పుడూ పరుగుల ప్రవాహం రావాలంటే కుదరదు...
Virat Kohli
అయినా ఈ బ్యాడ్ టైమ్‌లో కూడా చాలా మంది కంటే విరాట్ కోహ్లీ ఎక్కువ పరుగులే చేస్తున్నాడు. ఈ ఒక్క విషయం చాలు విరాట్ కోహ్లీ ఎలాంటి బ్యాటర్ అనే విషయం చెప్పడానికి...
ఇంగ్లాండ్‌తో టెస్టులో విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని అనుకుంటున్నా. అతని టెక్నిక్‌లో ఎలాంటి లోపం లేదు. కానీ విరాట్‌కి ఇప్పుడు కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి...
ఎంత టాలెంట్ ఉన్నా లక్ కలిసి రాకపోతే వేస్ట్.. త్వరలోనే విరాట్ కోహ్లీ సెంచరీ మార్కు అందుకుంటాడు. అది జరిగితే ఇక అతను ఓ డిఫెరెంట్ ప్లేయర్‌గా మారతాడు... ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్...