- Home
- Sports
- Cricket
- సచిన్, సెహ్వాగ్, ద్రావిడ్, గంగూలీ, అనిల్ కుంబ్లే... అయినా అప్పుడు అలా, ఇప్పుడు ఈ ఇద్దరితోనే ఇలా...
సచిన్, సెహ్వాగ్, ద్రావిడ్, గంగూలీ, అనిల్ కుంబ్లే... అయినా అప్పుడు అలా, ఇప్పుడు ఈ ఇద్దరితోనే ఇలా...
సౌతాఫ్రికా పర్యటనకు ముందు భారత జట్టు రెండుగా చీలిందనే పుకార్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఇగో క్లాషెస్ కారణంగానే టీమిండియాకి ఈ పరిస్థితి వచ్చిందని ట్రోల్స్ వినిపిస్తున్నాయి...

ప్రస్తుత భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రూపంలో ఇద్దరు సూపర్ స్టార్లు ఉన్నారు. జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ వంటి క్రికెటర్లకు ఫాలోయింగ్ ఉన్నా... విరాట్, రోహిత్ ఫాలోయింగ్, క్రేజ్, అనుభవం వేరు...
ఈ కారణంగా టీమిండియా కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య తారతమ్యాలు వచ్చాయని, ఆ ఇద్దరి మధ్య వైరం పెరిగిపోయిందని ట్రోల్స్ వస్తున్నాయి...
అయితే భారత జట్టులో స్టార్లు ఇప్పుడే కొత్తేమీ కాదు. 10, 15 ఏళ్ల క్రితం భారత జట్టు నిండా స్టార్ క్రికెటర్లే ఉండేవాళ్లు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే...ఇలా సీనియర్ స్టార్లతో భారత జట్టు నిండి ఉండేది...
వీరితో పాటు యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, అజిత్ అగర్కార్, గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, ఎమ్మెస్ ధోనీ వంటి యువ క్రికెటర్లు కూడా జట్టులో ఉండేవాళ్లు...
అయితే ఏనాడూ ఇగోల కారణంగా భారత జట్టులో గొడవలు జరిగినట్టు విన్నదీ లేదు, అలా సంఘటనల గురించి చదివిందీ లేదు... కారణం అప్పటి టీమ్ కల్చర్...
సచిన్ టెండూల్కర్ పరుగుల వరద పారిస్తున్నా, యువ క్రికెటర్లతో కూడా ఎంతో చనువుగా ఉండేవాడు. మిగిలిన క్రికెటర్లకు కూడా ఒకరంటే ఒకరికి గౌరవం ఉండేవి...
అందుకే ప్లేయింగ్ ఎలెవన్‌లో 11 మంది లెజెండరీ క్రికెటర్లు ఉన్నా... ఇగో గొడవలు వచ్చింది లేదు. సౌరవ్ గంగూలీకి దర్పం ఎక్కువని, కాస్త అహంకారం ఎక్కువని వినిపించినా, దానికంటే టీమ్‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడు...
అందుకే కెప్టెన్‌గా సక్సెస్ అందుకున్న తర్వాత కూడా ఫామ్‌లో లేక జట్టుకి దూరమై, రీఎంట్రీలో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ఓ ప్లేయర్‌గా ఆడడానికి సిగ్గుపడలేదు, ఇబ్బందిపడలేదు...
కారణం ఒకటే... అప్పటి ఆటగాళ్లకు ఆటే ముఖ్యం, ఆట కంటే క్రికెటర్ల స్టార్‌డమ్‌కి అసలు విలువ ఉండేది కాదు. ఆటను ఎంతగానో ప్రేమించాడు కాబట్టే తన అనుభవంలో సగం వయసున్న మాహీ కెప్టెన్సీలో ఆటగాడిగా కొనసాగాడు సచిన్ టెండూల్కర్...
అయితే నేటితరంలో క్రికెట్ గేమ్ కంటే క్రికెటర్ల స్టార్‌డమ్‌కి విలువ పెరిగిపోయింది. అన్నింటికీ మించి సాటి ఆటగాడిని గౌరవించే సంప్రదాయం రోజురోజుకీ కనుమరుగవుతోంది...
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేస్తే, రోహిత్ శర్మ టీ20ల్లో నాలుగు సెంచరీలు, వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేశాడు. ఇద్దరివీ భిన్నమైన ఆటతీరు, భిన్నమైన మనస్తత్వం...
ఇలాంటి భిన్నమైన మనస్తత్వాలు ఉన్నప్పటికీ సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్‌తో కలిసి ఆడడాన్ని ఎంజాయ్ చేసేవాడు. వీరూ, సచిన్ ఆటను చూస్తూ, పాఠాలు నేర్చుకునేవాడు. నేటితరంలో కరువైంది అదే...
భారత జట్టులో గొడవలు నిజం కావచ్చు, కాకపోవచ్చు... అయితే 2000-2005 వరకూ సచిన్ టెండూల్కర్,వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లేలతో నిండిన జట్టే... చాలామంది క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫెవరెట్‌గా నిలిచిపోయింది...