రోహిత్ శర్మ, విరాట్ మధ్య మాటల్లేవా... కోహ్లీ స్టేట్‌మెంట్ వెనక అర్థమేంటి?...
First Published Nov 29, 2020, 9:51 AM IST
2020 మిస్టరీ ఇయర్‌లాగే రోహిత్ శర్మ గాయం కూడా ఓ అంతుచిక్కని సమస్యగా మారింది. తాను ఫిట్‌గా ఉన్నానంటూ రోహిత్ శర్మ ఐపీఎల్ మ్యాచులు కూడా ఆడేశాడు, బీసీసీఐ మాత్రం రోహిత్ ఫిట్‌గా అవ్వడానికి ఇంకా సమయం పడుతుందని ఆలస్యం చేస్తోంది. ఈ గొడవ నడుస్తుండగానే రోహిత్ శర్మ గాయం గురించి తనకు తెలియదని, అతను ఎందుకు ఆస్ట్రేలియా రాలేదో కూడా తెలియదని విరాట్ కోహ్లీ చెప్పడం అనేక చర్చలకు తావిస్తోంది.

గత దశాబ్ద కాలంలో టీమిండియాలో కీలక ఆటగాళ్లుగా మారారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. విరాట్ అన్ని ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తుంటే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రారాజుగా వెలుగొందుతున్నాడు రోహిత్ శర్మ.

అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య మనస్పర్థలు ఉన్నాయని ఏడాదిన్నరగా వినిపిస్తున్న వార్త. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఓటమికి కారణం ఇదేనని కూడా టాక్ వినిపించింది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?