- Home
- Sports
- Cricket
- క్రీజులోకి వెళ్తుంటే టెండూల్కర్ నాతో అదే చెప్పాడు... 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ...
క్రీజులోకి వెళ్తుంటే టెండూల్కర్ నాతో అదే చెప్పాడు... 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ...
నూరు కోట్లకు పైగా ఉన్న భారతీయుల కలలను నెరవేరిన రోజు నేడు. ఏప్రిల్ 2, 2011న శ్రీలంకను ఓడించి, 28 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచింది టీమిండియా. ఫైనల్ మ్యాచ్‌లో 31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చాడు విరాట్ కోహ్లీ...

గౌతమ్ గంభీర్‌తో కలిసి మూడో వికెట్‌కి 83 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ, 49 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
వన్డే వరల్డ్ కప్ 2011 విజయానికి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విరాట్ కోహ్లీ, ఆనాటి అనుభవాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు...
‘నేను క్రీజులోకి వెళ్లే సమయానికి 2 వికెట్లు పడిపోయాయి. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ అవుట్ అయ్యారు. నేను క్రీజులోకి వచ్చేటప్పుడు టెండూల్కర్ నాతో కొన్ని మాటలు చెప్పారు.
భాగస్వామ్యాన్ని నిర్మించండి...’ అని టెండూల్కర్ చెప్పాడు. నేను అదే ఆలోచనతో బ్యాటింగ్ చేశా. నేను, గౌతమ్ గంభీర్ కలిసి దాదాపు 90 పరుగులు జోడించాం..
ఆ మ్యాచ్‌లో నేను చేసిన 35 పరుగులు, నా క్రికెట్ కెరీర్‌ని మార్చేశాయి. వరల్డ్ కప్ విజయంలో నా వంతు పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది..
వరల్డ్ కప్ గెలిచిన అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. స్టేడియంలోని జనాలంతా వందేమాతరం పాడుతున్నారు. దాంతో పాటు జో జీతా వోహీ సికిందర్ పాటలు ప్లే అవుతున్నాయి...
అదో నమ్మశక్యంకాని మూమెంట్. ఇప్పటికీ ఆ క్షణాలు నా మదిలో నిలిచే ఉన్నాయి. టెండూల్కర్, దేశ గౌరవాన్ని దాదాపు 21 ఏళ్లు తన భుజాలపై మోశాడు...
ఆ విజయం తర్వాత ఆయన్ని మేం మోశాం.. సచిన్ టెండూల్కర్ ఇచ్చిన విలువలను, వారసత్వాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మాపై ఉంది...
11 ఏళ్ల తర్వాత ఇప్పుడు నాకు ఈరోజు అనిపిస్తోంది. సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల పాటు ఇంత మంది ఆశలను, అంచనాలను ఆ భారాన్ని ఎలా మోశారో... అని...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ..