రహానే నిజంగానే అద్భుతం చేశాడు... విజయంపై విరాట్ కోహ్లీ ట్వీట్... రోహిత్, సచిన్ కూడా...
First Published Dec 29, 2020, 11:57 AM IST
బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకున్న టీమిండియాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు భారత సారథి విరాట్ కోహ్లీ... కోహ్లీతో పాటు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, ఇతర క్రికెటర్లు కూడా ఆడిలైడ్ టెస్టు తర్వాత టీమిండియా కమ్ బ్యాక్ ఇచ్చిన విధానాన్ని కొనియాడుతూ ట్వీట్ల వర్షం కురిపించారు...

‘విరాట్, రోహిత్, ఇషాంత్, షమీ లేకుండా టెస్టు మ్యాచ్ గెలవడం నిజంగా చాలా గొప్ప అఛీవ్‌మెంట్. మొదటి టెస్టు పరాజయం తర్వాత భారత జట్టు తిరిగి వచ్చిన విధానం నాకెంతో నచ్చింది... బ్రిలియెంట్ విన్... వెల్ డన్ టీమిండియా...’ అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్.

‘ఇది నిజంగా అద్భుత విజయం.. భారత జట్టంతా కలిసి కట్టు అద్భుతంగా రాణించింది.. బాయ్స్‌ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా భారత జట్టును జింక్స్ (అజింకా రహానే) అద్భుతంగా నడిపించాడు... ఇక నుంచి ముందుకి, పైకి...’ అంటూ ట్వీట్ చేశాడు భారత సారథి విరాట్ కోహ్లీ...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?