టీ20 వరల్డ్ కప్‌లో యశస్వి జైస్వాల్‌తో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ! అతని వల్లే.. విండీస్ లెజెండ్ కామెంట్స్..
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఈ ఇద్దరూ పొట్టి ఫార్మాట్‌కి దూరమైనట్టేనని అనుకున్నారు ఫ్యాన్స్. అయితే వన్డే వరల్డ్ కప్ మీద ఫోకస్ పెట్టడం కోసమే టీ20లకు దూరంగా ఉన్నట్టు కామెంట్ చేశాడు రోహిత్ శర్మ..
Sanju and Kohli
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా అండ్ కో తిరిగి టీ20ల్లోకి తిరిగి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టే కనిపిస్తోంది. తాజాగా వెస్టిండీస్ మాజీ లెజెండ్ ఇయాన్ బిషప్, టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..
‘వన్డే వరల్డ్ కప్ టోర్నీకి గ్లోబల్ ఇంపాక్ట్ రావడానికి విరాట్ కోహ్లీయే ప్రధాన కారణం. ఈ విషయంలో అతనికి క్రెడిట్ దక్కి తీరాల్సిందే. ఇండియాలోనే మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు టీవీలకు, మొబైళ్లకు అతుక్కుపోతున్నారు..
యశస్వి జైస్వాల్ చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మొదటి బంతి నుంచి అటాకింగ్ చేయాలని ఆలోచిస్తున్నాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ మాత్రం ఇన్నింగ్స్ నిర్మించడానికి సమయం తీసుకుంటున్నాడు. అదీకాకుండా అతను నిలకడైన ప్రదర్శన ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాడు..
నా వరకూ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ కలిసి ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది. ఓపెనర్‌గా విరాట్ కోహ్లీకి ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది. టీమిండియా దాన్ని వాడుకోవాలి... ’ అంటూ కామెంట్ చేశాడు వెస్టిండీస్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఇయాన్ బిషప్..
వచ్చే ఏడాది జూన్‌లో వెస్టిండీస్, యూఎస్‌ఏ వేదికగా టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ జరగబోతోంది. వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ, టీ20ల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు రోహిత్ శర్మ కామెంట్ చేశాడు. అదే జరిగితే రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ కలిసి టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో ఓపెనింగ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి..
Virat Kohli and Rohit Sharma
ఆ లోపు యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా క్లిక్ అయినా శుబ్‌మన్ గిల్‌ని కాదని, అతన్ని ఓపెనర్‌గా ఆడించడానికి టీమిండియా మేనేజ్‌మెంట్ సాహసించకపోవచ్చు. విదేశాల్లో ఇబ్బంది పడుతున్నా, శుబ్‌మన్ గిల్‌కే మొదటి ప్రాధాన్యం దక్కుతుందనడంలో సందేహం లేదు..