- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీ టెస్టు ఎంట్రీకి 12 ఏళ్లు! సరిగ్గా ఇదే రోజున సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ కూడా...
విరాట్ కోహ్లీ టెస్టు ఎంట్రీకి 12 ఏళ్లు! సరిగ్గా ఇదే రోజున సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ కూడా...
విరాట్ కోహ్లీ, ప్రస్తుత తరంలో వరల్డ్ గ్రేటెస్ట్ బ్యాటర్. అనితర సాధ్యమైన రీతిలో మూడు ఫార్మాట్లలో పరుగుల వరద పారించిన ఒకే ఒక్కడు. దశాబ్ద కాలంలో 20 వేలకు పైగా పరుగులు చేసి ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది డికేట్’ అవార్డు దక్కించుకున్న విరాట్ కోహ్లీ, టెస్టుల్లో తన రేంజ్ మాస్ ఇన్నింగ్స్ ఆడి చాలా ఏళ్లే అవుతోంది...

Image credit: PTI
2011, జూన్ 20న టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు విరాట్ కోహ్లీ. టెస్టుల్లో 7 డబుల్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, టెస్టుల్లో అత్యధిక ద్విశతకాలు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. 2019లో టెస్టుల్లో 27 సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, 28వ టెస్టు సెంచరీ అందుకోవడానికి మూడున్నరేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది..
Image credit: PTI
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో టెస్టులో 186 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టెస్టు ఫార్మాట్‌లో 8479 పరుగులతో ఉన్నాడు. అయితే వింటేజ్ విరాట్ కోహ్లీ టెస్టు బ్యాటింగ్ చూసి మాత్రం చాలా కాలమే అయ్యింది...
Image credit: PTI
నాలుగేళ్ల క్రితం విరాట్ కోహ్లీ టెస్టు బ్యాటింగ్, కుర్రాళ్లకు ఓ బ్యాటింగ్ గైడ్‌లా ఉండేది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే విరాట్ కోహ్లీ, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి భాగస్వామ్యాలు నెలకొల్పుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించేవాడు...
Image credit: Getty
అహ్మదాబాద్ టెస్టులో ఇన్నింగ్స్‌లో అలాంటి ఛాయలు కనిపించినా, బౌలర్లపై విరాట్ కోహ్లీ డామినేషన్ కనిపించలేదు. 186 పరుగులు చేస్తే అందులో విరాట్ కోహ్లీ బౌండరీలు 15 ఫోర్లు మాత్రమే. అంటే సింగిల్స్, డబుల్స్ ద్వారానే ఎక్కువ పరుగులు సాధించాడు విరాట్ కోహ్లీ..
2019లో ప్రస్తుత తరంలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, ఇప్పుడు టాప్ 3కి పడిపోయాడు. విరాట్‌కి చాలా దూరంలో ఉన్న జో రూట్, స్టీవ్ స్మిత్ ఇప్పుడు సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ టాప్ గేర్‌లో దూసుకుపోతుంటే... విరాట్ కోహ్లీ మాత్రం టెక్నిక్ మరిచిపోయినట్టుగా డిఫెన్సివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు..
స్టీవ్ స్మిత్, జో రూట్ వంటి ప్లేయర్లు... టెస్టు ఫార్మాట్‌పై ఫోకస్ పెట్టేందుకు వైట్ బాల్ క్రికెట్‌కి దూరమయ్యారు. గత ఏడాది 2022 టీ20 వరల్డ్ కప్ నుంచి విరాట్ కోహ్లీ కూడా టీ20ల్లో ఆడడం లేదు. అయితే విరాట్ కోహ్లీకి, ఆ మిగిలిన ఇద్దరికీ ఉన్న తేడా ఐపీఎల్ మాత్రమే...
జో రూట్ ఈసారి ఐపీఎల్ ఆడేందుకు ఇక్కడికి వచ్చినా, తుది జట్టులోకి వచ్చిన మ్యాచులు, టీమ్‌లోకి వచ్చిన బ్యాటింగ్‌కి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. స్టీవ్ స్మిత్ అయితే పూర్తిగా ఐపీఎల్‌కి దూరంగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ మాత్రం ఐపీఎల్‌లో ఆడి, మూడు ఫార్మాట్లలోనూ ఆడాలని అనుకుంటున్నాడు. ఇదే అతని నేచురల్ ఆటను దెబ్బతీస్తోందని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్..
2019లో 55 యావరేజ్‌తో టెస్టుల్లో పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మూడు ఫార్మాట్లలో 50+ యావరేజ్ కలిగిన ఏకైక బ్యాటర్‌గా ఉండేవాడు. అయితే మూడేళ్లు గడిచేసరికి విరాట్ కోహ్లీ టెస్టు సగటు 48.72కి పడిపోయింది. ఇదే అభిమానులను కలవరబెడుతున్న విషయం...
సరిగ్గా ఇదే రోజున 1996, జూన్ 20న ఇంగ్లాండ్ పర్యటనలో లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశారు రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ... తొలి ఇన్నింగ్స్‌లో 301 బంతుల్లో 20 ఫోర్లతో 131 పరుగులు చేసిన సౌరవ్ గంగూలీ, లార్డ్స్‌లో ఆరంగ్రేటం చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు..
ఇదే మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేసిన రాహుల్ ద్రావిడ్ 267 బంతుల్లో 6 ఫోర్లతో 95 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒకే రోజున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన గంగూలీ, ద్రావిడ్ ఇద్దరూ కూడా ఆ తర్వాత టీమిండియా కెప్టెన్లుగా రాణించారు... ఆ తర్వాత 15 ఏళ్లకు టెస్టు ఎంట్రీ చేసిన విరాట్ కోహ్లీ కూడా టీమిండియా టెస్టు కెప్టెన్‌గా సక్సెస్ కావడం విశేషం..