MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయం... టీ20 వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్సీకి వీడ్కోలు....

విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయం... టీ20 వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్సీకి వీడ్కోలు....

భారత సారథి విరాట్ కోహ్లీ, టీమిండియాకే కాదు వరల్డ్‌ టెస్టు మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్లలో ఒకడు. టీ20, వన్డేల్లో కూడా కోహ్లీకి మంచి రికార్డు ఉంది. అయితే ఐసీసీ ఈవెంట్లలో మాత్రం విరాట్ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 13 2021, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఓడిన టీమిండియా, ఆ తర్వాత 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌లో, ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూీజిలాండ్ చేతుల్లో ఓడింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

ఐపీఎల్ కెరీర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా 8 సీజన్లుగా ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు విరాట్ కోహ్లీ... 

311

అదే టైంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఐదు టైటిల్స్ అందుకున్నాడు. ఇదే విరాట్‌ కోహ్లీకి ఇబ్బందులు తీసుకొచ్చింది...

411

టీ20, వన్డేల్లో టీమిండియా కెప్టెన్సీని రోహిత్ శర్మకి అప్పగించాలని దాదాపు రెండేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు ‘హిట్ మ్యాన్’ అభిమానులు...

511

రెండేళ్లుగా బ్యాటుతో సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్న విరాట్ కోహ్లీ... టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగినా, వన్డే, టీ20ల్లో కెప్టెన్సీని రోహిత్‌కి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాడట...

611

అక్టోబర్‌లో యూఏఈ వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ... విరాట్ కోహ్లీకి పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఆఖరి టోర్నమెంట్ అని సమాచారం...

711

ఇప్పటికే రోహిత్ శర్మతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్‌తో ఈ విషయం గురించి చర్చించిన విరాట్ కోహ్లీ... టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఫలితం ఏదైనా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఫిక్స్ అయ్యాడట...

811

టీమిండియా తరుపున 65 టెస్టుల్లో 38 విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీ.... టీమిండియాకి అత్యధిక టెస్టు విజయాలు, విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న కెప్టెన్‌గా టాప్‌లో నిలిచాడు...

911

వన్డేల్లో 95 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్, 65 విజయాలను అందుకున్నాడు. 45 టీ20 మ్యాచుల్లో 29 మ్యాచుల్లో విజయాలు అందుకున్నాడు...

1011

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా గత 9 టీ20 సిరీస్‌ల్లో ఓటమి ఎదుర్కోలేదు. టీమిండియా ఓడిన ఆఖరి రెండు టీ20 సిరీస్‌ల్లో ఓ దానికి రోహిత్, మరోదానికి శిఖర్ ధావన్‌ కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం..

1111

గత రెండేళ్లలో 52 ఇన్నింగ్స్‌లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, బ్యాటింగ్‌పై పూర్తిగా ఫోకస్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !
Recommended image2
Team India Schedule: ఐపీఎల్ అయిపోయింది.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది! 2027 వరల్డ్ కప్ దాకా భారత్‌కు నో రెస్ట్
Recommended image3
IPL 2026 Most Runs: ఐపీఎల్ 2026లో అత్యధిక రన్స్ చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved