MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కోహ్లీ ఒక్కడు ఎన్ని మ్యాచ్‌లు గెలిపిస్తాడు? మీరంతా ఉండి ఏం చేస్తున్నట్టు? రోహిత్, రాహుల్‌పై మదన్‌లాల్ ఆగ్రహం

కోహ్లీ ఒక్కడు ఎన్ని మ్యాచ్‌లు గెలిపిస్తాడు? మీరంతా ఉండి ఏం చేస్తున్నట్టు? రోహిత్, రాహుల్‌పై మదన్‌లాల్ ఆగ్రహం

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్  వేటను పాకిస్తాన్ ను ఓడించి ఘనంగా ఆరంభించింది టీమిండియా.  మాజీ సారథి విరాట్ కోహ్లీ ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించాడు. అయితే ప్రతీ మ్యాచ్ లో  కోహ్లీ మీద ఆధారపడటం కరెక్ట్ కాదని అంటున్నాడు  భారత మాజీ క్రికెటర్, సెలక్టర్ మదన్ లాల్. 

2 Min read
Author : Srinivas M
Published : Oct 26 2022, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పాకిస్తాన్ తో ఆదివారం ముగిసిన మ్యాచ్ లో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీ - హార్దిక్ పాండ్యాలు సెంచరీ భాగస్వామ్యంతో టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. చివర్లో పాండ్యా నిష్క్రమించినా  కోహ్లీ వీరోచిత పోరాటం చేసి భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అయితే ప్రతీసారి కోహ్లీ మీద ఆధారపడితే భారత్ టీ20  ప్రపంచకప్ గెలవలేదని  అంటున్నాడు 1983 వరల్డ్ కప్ లో భారత జట్టులోని సభ్యుడు, మాజీ సెలక్టర్ మదన్ లాల్.   కోహ్లీ మీద ఆధారపడితే కుదరదని.. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ కూడా ఆడి సమిష్టిగా  ఆడితేనే భారత్ లక్ష్యం చేరుకుంటుందని సూచించాడు. 

36

తాజాగా ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  మదన్ లాల్ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ తో మ్యాచ్ లో కోహ్లీ ఇన్నింగ్స్ అద్భుతం.  గతంలో ఇలాంటి ఇన్నింగ్స్ నేను ఎప్పుడూ చూడలేదు. అయితే  ఒక్క కోహ్లీ మీదే ఆధారపడటం సరికాదు.  కోహ్లీ మీకు ప్రతీ మ్యాచ్ గెలిపించలేడు.    ప్రపంచకప్ అనేది చాలా పెద్ద టోర్నమెంట్. ఇంత పెద్ద టోర్నీని ఒక్కడే గెలిపించడం అసాధ్యం. 

46

పాకిస్తాన్ తో మ్యాచ్ లో విఫలమైన  రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లు ఇకనైనా  మేల్కొంటే మంచిది. వాళ్లిద్దరిమీద అభిమానులు కోట్లాది ఆశలు పెట్టుకున్నారు.  ప్రతీ మ్యాచ్ కు కొత్త హీరో ఉంటాడు. అందరూ  సమిష్టిగా ఆడితేనే  భారత్ లక్ష్యం నెరవేరుతుంది..  

56

ప్రపంచకప్ లో భారత ప్రయాణం ఇప్పుడే మొదలైంది. టీ20 ఫార్మాట్ లో ఏ జట్టునూ తక్కువగా అంచనా వేయడానికి లేదు.  నెదర్లాండ్ కూడా మంచి జట్టే. ప్రత్యర్థులను బట్టి  మన తుది జట్టులో కూడా మార్పులుండాలి.  ప్రతీ  మ్యాచ్ కూ ఒకే జట్టంటే కుదరదు. పేసర్లు, స్పిన్నర్లు, ఆల్ రౌండర్లతో జట్టులో సమతూకం ఉండాలి.  

66

వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను కూడా ప్రతీ మ్యాచ్ లో ఆడించాలి. పంత్ ఐదు మ్యాచ్ లు ఆడితే అందులో కచ్చితంగా మూడు మ్యాచ్ లను గెలిపిస్తాడు. అతడికి ఛాన్సులు ఇవ్వాలి...’ అని  మదన్ లాల్  తెలిపాడు. భారత జట్టు తర్వాత మ్యాచ్ లో ఈనెల 27న నెదర్లాండ్స్ తో పోటీ పడనుంది. సిడ్నీ వేదికగా జరుగబోయే మ్యాచ్ లో  భారత  తుది జట్టులో మార్పులు ఉండే అవకాశాలున్నాయి. 

About the Author

SM
Srinivas M
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026: ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్స్ వీరే !
Recommended image2
IPL 2026 Playoff Race: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లొల్లి.. మూడు బెర్తులు కన్ఫర్మ్.. ఆ నాలుగో స్థానం ఎవరిది?
Recommended image3
IPL : ఈడు మామూలోడు కాదు బాబోయ్! ఇషాన్ కిషన్ ఊచకోతకు చెన్నై ఖేల్ ఖతం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved