- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీ ఛేజ్ మాస్టర్ అయితే మావోడు అంతకుమించి... బాబర్ ఆజమ్‌పై షోయబ్ అక్తర్...
విరాట్ కోహ్లీ ఛేజ్ మాస్టర్ అయితే మావోడు అంతకుమించి... బాబర్ ఆజమ్‌పై షోయబ్ అక్తర్...
ఆసియా కప్ 2022 టోర్నీలో అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చిన పాకిస్తాన్ యంగ్ కెప్టెన్ బాబర్ ఆజమ్, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. టీ20ల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న బాబర్ ఆజమ్, కెప్టెన్‌గా రెండో టీ20 సెంచరీ చేసి రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. పాక్ కెప్టెన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...

Babar Azam
తొలి టీ20లో ఇంగ్లాండ్ చేతుల్లో చిత్తుగా ఓడిన పాకిస్తాన్, రెండో టీ20లో 10 వికెట్ల తేడాతో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ కలిసి ఊదేశారు...
Babar Azam and Mohammad Rizwan
కెప్టెన్ బాబర్ ఆజమ్ 66 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 110 పరుగులు చేయగా మహ్మద్ రిజ్వాన్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 203 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి, ఇంతకుముందున్న రికార్డులన్నీ బ్రేక్ చేసేశారు..
Babar Azam
‘ఈ ఛేజ్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. విరాట్ కోహ్లీ ఛేజ్ మాస్టర్ అయితే బాబర్ ఆజమ్ ఆ కళలో మాస్టర్స్ చేసేశాడు. బాబర్ ఆజమ్ ఆడిన విధానం విరాట్ కోహ్లీ గొప్ప క్యారెక్టర్‌ని తలపించింది. బాబర్ ఆజమ్ ఆ కళను ఎంతగా వశం చేసుకున్నాడో తన ఆటలో చూపించాడు...
బాబర్ ఆజమ్ క్లాస్ ముందు ప్రపంచంలో ఏ క్రికెటర్ కూడా పనికి రాడు. అతని షాట్ సెలక్షన్, టెక్నిక్ అన్నీ క్లాస్‌గా ఉంటాయి. ఇప్పుడు అతని స్ట్రైయిక్ రేటు 150-160 దాటేసింది. అతను మరోస్థాయికి చేరుకున్నాడు. బాబర్ ఇలాగే ఆడుతూ పోతే పాకిస్తాన్ ఈజీగా మ్యాచులు గెలుస్తుంది...
Babar Azam backs Virat Kohli
పాకిస్తాన్‌కి కావాల్సింది ఇదే. పరుగులు రావాలి, స్ట్రైయిక్ రేటు బాగుండాలి. ఓపెనర్లు ఇద్దరూ ఈ రెండింటినీ లెక్కేసి బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా బాబర్ ఆజమ్, తాను వరల్డ్ నెం.1 ప్లేయర్‌ని ఎందుకో నిరూపించుకున్నాడు... ’అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్..