మ్యాచ్ నెంబర్ 500! విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన ఫీట్... టీమిండియా తరుపున ఆ ముగ్గురూ మాత్రమే...
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టులో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటిదాకా 9 మంది ప్లేయర్లు మాత్రమే 500లకు పైగా అంతర్జాతీయ మ్యాచులు ఆడారు..
Image credit: PTI
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, తన 24 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 664 మ్యాచులు ఆడారు. 200 టెస్టులు, 463 వన్డేలు ఆడిన సచిన్ టెండూల్కర్.. ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడి ఈ లిస్టులో టాప్‌లో ఉన్నాడు...
శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్థనే, 652 అంతర్జాతీయ మ్యాచులతో సచిన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. 149 టెస్టులు, 448 వన్డేలు ఆడిన జయవర్థనే, 55 టీ20 మ్యాచులు కూడా ఆడాడు...
మహేళ జయవర్థనే సహచరుడు కుమార సంగర్కర, 594 అంతర్జాతీయ మ్యాచులతో అత్యధిక ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడిన మూడో ప్లేయర్‌గా ఉన్నాడు. 134 టెస్టులు, 404 వన్డేలు, 56 టీ20 మ్యాచులు ఆడిన కుమార సంగర్కర, 600 మ్యాచుల క్లబ్‌లో చేరలేకపోయాడు..
శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య 586 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. 110 టెస్టులు, 445 వన్డేలు, 31 టీ20 మ్యాచులు ఆడిన సనత్ జయసూర్య, శ్రీలంక తరుపున అత్యధిక అంతర్జాతీయ మ్యాచులు ఆడిన మూడో ప్లేయర్...
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 560 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. 168 టెస్టులు, 375 వన్డేలు ఆడిన రికీ పాంటింగ్, 17 టీ20 మ్యాచులు ఆడాడు. ఆస్ట్రేలియా తరుపున 500+ అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ఏకైక ప్లేయర్ రికీ పాంటింగ్..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 538 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. 90 టెస్టులు మాత్రమే ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచులు ఆడాడు. 100 టీ20 మ్యాచులు, 100 టెస్టులు ఆడే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు ధోనీ..
పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ, 524 అంతర్జాతీయ మ్యాచులు ఆడి పాక్ తరుపున 500+ అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ప్లేయర్‌గా నిలిచాడు. తన కెరీర్‌లో ఐదు సార్లు రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న ఆఫ్రిదీ మొత్తంగా 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20 మ్యాచులు ఆడాడు..
సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వస్ కలీస్ 519 అంతర్జాతీయ మ్యాచులు ఆడి ఈ జాబితాలో ఉన్న ఏకైక సఫారీ క్రికెటర్‌గా నిలిచాడు. 166 టెస్టులు, 328 వన్డేలు ఆడిన జాక్వస్ కలీస్, 17 టీ20 మ్యాచులు ఆడాడు..
ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్, మాజీ భారత క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ తన కెరీర్‌లో 509 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. 164 టెస్టులు, 344 వన్డేలు ఆడిన రాహుల్ ద్రావిడ్, ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడాడు..
విరాట్ కోహ్లీ, వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టుతో 500 అంతర్జాతీయ మ్యాచులు పూర్తి చేసుకోబోతున్నాడు. ఇప్పటిదాకా 110 టెస్టులు, 274 వన్డేలు, 115 టీ20 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, 500లకు పైగా మ్యాచులు ఆడిన ప్లేయర్లలో మూడు ఫార్మాట్లలో 100కి పైగా మ్యాచులు ఏకైక ప్లేయర్ కూడా...