23 టెస్టులుగా సెంచరీ మార్కు అందుకోని విరాట్ కోహ్లీ.. ఢిల్లీలో కూడా కొట్టలేకపోతే...
విరాట్ కోహ్లీ ఫామ్ గురించి కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. గత దశాబ్దంలో పరుగుల వరద పారించి, ‘రన్ మెషిన్’గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్, మూడేళ్ల పాటు అంతర్జాతీయ సెంచరీ లేకుండానే గడిపేశాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌పై టీ20 సెంచరీ బాది, ఎట్టకేలకు ఆ బ్రేక్‌ని బ్రేక్ చేశాడు...

బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో సెంచరీ బాది... మూడేళ్ల బ్రేక్ తర్వాత వన్డేల్లో కూడా సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ, మూడు మ్యాచుల్లో రెండు శతకాలు కొట్టేశాడు. అయితే టెస్టుల్లో మాత్రం విరాట్ బ్యాటు నుంచి ఇంకా సెంచరీ రాలేదు. నాగ్‌పూర్ టెస్టులో 12 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, ఢిల్లీ టెస్టులోనూ సెంచరీ మార్కును చేరుకోలేకపోయాడు.
Image credit: PTI
సొంత మైదానంలో తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి పర్వాలేదనిపించిన విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పుడెప్పుడో 2019లో ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌పై 27వ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ, సెంచరీ లేకుండా 23 టెస్టులు ఆడేశాడు..
Image credit: PTI
విరాట్ కంటే ముందు సెంచరీ బాది ఛతేశ్వర్ పూజారా, మూడేళ్ల బ్రేక్ తర్వాత బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో శతకాన్ని నమోదు చేశాడు. అయితే విరాట్ మాత్రం ఇంకా టెస్టు సెంచరీని అందుకోలేకపోతున్నాడు. గత మూడేళ్లలో విరాట్ కోహ్లీ టెస్టు సగటు 30 కూడా దాటలేదు..
Image credit: PTI
కెఎల్ రాహుల్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది కాబట్టి విరాట్ కోహ్లీ సేఫ్ అయిపోయాడు. లేకపోతే టెస్టుల్లో విరాట్ కోహ్లీ ప్లేస్ గురించి కూడా పెద్ద చర్చే జరిగేది. ఎందుకంటే టెస్టు సెంచరీ లేకుండా 39 ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ చేసేశాడు విరాట్ కోహ్లీ..
Image credit: Getty
‘ఈ గణాంకాలు కొందరు భారత క్రికెట్ ఫ్యాన్స్‌కి నచ్చకపోవచ్చు. కానీ విరాట్ కోహ్లీ చివరి టెస్టు సెంచరీ బాది 23 టెస్టులు అయిపోయాయి. 2019లో అతను ఆఖరి సెంచరీ బాదాడు. ఇంకెంత కాలం తీసుకుంటాడు..’ అంటూ ఐస్‌లాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది..
Image credit: Getty
బాబర్ ఆజమ్‌తో సహా పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌ని కూడా ట్రోల్ చేసే ఐస్‌లాండ్ క్రికెట్, విరాట్ కోహ్లీ టెస్టు ఫామ్‌ని ట్రోల్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. గత మూడేళ్లలో విరాట్ కోహ్లీ టెస్టు సగటు 30 కూడా దాటలేదని, ఇలాంటి ఫామ్‌లో వేరే ప్లేయర్ల ఉంటే ఇన్నాళ్లు టీమ్‌లో ఉంటాడా? అని కూడా ఇంతకుముందు ప్రశ్నించింది ఐస్‌లాండ్ క్రికెట్ టీమ్..
ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 25 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత టీమిండయా తరుపున 25 వేల పరుగులు కూడా క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...
‘25 వేల పరుగులు చేయడమంటే మామూలు విషయం కాదు. విరాట్ తన కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాడు. ఆటలో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే పరిస్థితులకు తగ్గట్టుగా తన ఆటను మార్చుకుంటూ, టెక్నిక్‌ని మరింత మెరుగుపర్చుకుంటూ సక్సెస్ అయ్యాడు విరాట్. ప్రపంచంలో ప్రతీ చోట పరుగులు చేయగలగడం వల్లే విరాట్ గ్రేట్ ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు...’ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..