- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీ ఫెయిల్ అవ్వడం మంచిదే, అతనికి ఆ హక్కు ఉంది... డేవిడ్ వార్నర్ కామెంట్...
విరాట్ కోహ్లీ ఫెయిల్ అవ్వడం మంచిదే, అతనికి ఆ హక్కు ఉంది... డేవిడ్ వార్నర్ కామెంట్...
భారత టెస్టు సారథి విరాట్ కోహ్లీ రెండేళ్లుగా సరైన ఫామ్‌లో లేడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ మార్కు అందుకోలేకపోతున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీ ర్యాంకు దిగజారుతూనే ఉంది...

Virat Kohli
టీ20 వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత టీ20, వన్డే కెప్టెన్‌గానూ వైదొలిగాడు విరాట్ కోహ్లీ. టీ20 కెప్టెన్సీ నుంచి స్వచ్ఛందంగా తప్పుుంటే, వన్డేల నుంచి బీసీసీఐ తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది...
విరాట్ కోహ్లీ సెంచరీ లేకుండా 777 రోజులను పూర్తి చేసుకున్నాడు. ఒకప్పుడు సరదాకి సెంచరీలు చేస్తూ వచ్చిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు సెంచరీ మార్కు అందుకోలేకపోవడం తీవ్రమైన ట్రోలింగ్ రావడానికి కారణమవుతోంది...
Virat Kohli
విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేకపోవడం వల్లే భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందనే వాదన కూడా వినిపించింది. తాజాగా విరాట్ కోహ్లీ ఫామ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్...
‘రెండేళ్లుగా విరాట్ కోహ్లీ ఫామ్ గురించి చాలా మంది, చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్లు ఓ విషయాన్ని మరిచిపోతున్నారు. రెండేళ్లుగా మనమంతా కరోనా విపత్తును ఎదుర్కొంటున్నాం...
ఈ ఏడాదిలో అతనికి ఓ కూతురు పుట్టింది. అతను ఏం చేయగలడో ఇంతకుముందే నిరూపించుకున్నాడు. ఇప్పుడు అతనికి ఫెయిల్ అయ్యే అధికారం, హక్కూ ఉన్నాయి...
ఎందుకంటే విరాట్ కోహ్లీ కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అయితే ఒకసారి పరుగుల వరద పారించిన తర్వాత అభిమానులు, మళ్లీ మళ్లీ అదే కోరుకుంటారు...
స్టీవ్ స్మిత్ కూడా సెంచరీ చేయడం లేదని అంటున్నారు. అయితే అతను ఇంతకుముందు ప్రతీ నాలుగు ఇన్నింగ్స్‌లకి ఓ సారి సెంచరీ చేసిన రికార్డులు ఉన్నాయి...
David Warner
వాళ్లు మనుషులే. ఓ రోబోలా పరుగులు చేయలేరు కదా... పరుగులు రానప్పుడు వాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారు, కానీ విమర్శలు చేసేవారికి అలాంటివేమీ ఉండవు కదా...’ అంటూ కామెంట్ చేశాడు డేవిడ్ వార్నర్..