MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • తప్పుకున్నాడా? తప్పించారా... విండీస్ టూర్‌లో విరాట్‌కి చోటు దక్కకపోవడంపై రచ్చ...

తప్పుకున్నాడా? తప్పించారా... విండీస్ టూర్‌లో విరాట్‌కి చోటు దక్కకపోవడంపై రచ్చ...

క్రికెట్ ప్రపంచంలో దిగ్గజాల మధ్య ఎంట్రీ ఇచ్చిన ఓ యువకుడు, ఒక్కో మెట్టూ ఎక్కుతూ రికార్డులు తిరగరాస్తూ తిరుగులేని స్టార్‌గా ఎదిగిన వైనాన్ని తెలుసుకోవాలంటే గత దశాబ్దంలో విరాట్ కోహ్లీ కెరీర్ గ్రాఫ్ చూస్తే తెలుసిపోతుంది... అలా వచ్చిన అమితమైన క్రేజ్ కారణంగా ఆ స్టార్ ప్లేయర్, అతి తక్కువ కాలంలోనే జట్టులో చోటు కోల్పోయే పరిస్థితికి దిగజారిన వైనం తెలుసుకోవాలంటే ఈ ఏడాదిన్నరలో కోహ్లీ ఫేస్ చేసిన పరిస్థితులను చూస్తే తెలిసిపోతుంది... 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 14 2022, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో విరాట్ కోహ్లీ పేరు లేకపోవడతో అతన్ని కావాలనే తప్పించారనే వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు విరాట్ కోహ్లీని తప్పించడంతో అతను పొట్టి ప్రపంచకప్ ఆడతాడా? అనే డౌట్స్ రేగుతున్నాయి...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

వెస్టిండీస్ టూర్‌లో వన్డే, టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఆసియా కప్ 2022 టోర్నీలో పాల్గొనబోతోంది భారత జట్టు. విండీస్ టూర్‌లో వన్డే సిరీస్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్‌లో రీఎంట్రీ ఇస్తాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు...

310
Image credit: Getty

Image credit: Getty

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో రెండు మ్యాచులు ఆడి 12 పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ, వన్డే సిరీస్‌లో పాల్గొనడంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. విరాట్ కోహ్లీకి ప్రస్తుతం గజ్జల్లో గాయమైందని, అందుకే తొలి వన్డేలో ఆడలేదని ప్రకటించింది బీసీసీఐ...

410

రెండో వన్డేలో కూడా విరాట్ కోహ్లీ ఆడడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం ఆఖరి వన్డేలో అయినా విరాట్ ఆడతాడా? లేదా? తేలాల్సి ఉంది... ఈ మధ్యకాలంలో ప్లేయర్లను తుదిజట్టులో నుంచి తప్పించడానికి గాయం వంకను వాడుతోంది బీసీసీఐ... విరాట్ విషయంలోనూ ఇదే జరిగిందా? అనేది ఆయన అభిమానుల డౌట్...

510
Image Credit: Getty Images

Image Credit: Getty Images

తన 14 ఏళ్ల కెరీర్‌లో గాయం కారణంగా విరాట్ కోహ్లీ ఆడని మ్యాచుల సంఖ్య నాలుగంటే నాలుగే. వరుసగా రెండు మ్యాచులకు దూరమైన సంఘటనలే లేవు. అలాంటిది బీసీసీఐతో విభేదాలున్నాయని వార్తలు వస్తున్న సమయంలో గాయం పేరు చెప్పి వరుసగా మ్యాచులకు దూరం కావడం పెను దుమారం రేపుతోంది...

610

అయితే వెస్టిండీస్ సిరీస్ నుంచి విశ్రాంతి కావాలని స్వయంగా విరాట్ కోహ్లీయే భారత క్రికెట్ బోర్డును కోరినట్టు సమాచారం. ఈ మధ్యకాలంలో సరిగ్గా పరుగులు చేయలేకపోతున్న కోహ్లీ, ఫామ్‌పై దృష్టి పెట్టేందుకు రెస్ట్ కావాలని కోరాడా? లేక కూతురితో కలిసి ఇంకాస్త ఎక్కువ సమయం గడిపేందుకు బ్రేక్ అడిగాడా? అనే విషయం తెలియరాలేదు...

710

2019లో 25 వన్డేలు ఆడి 5 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, 2020లో లాక్‌డౌన్ కారణంగా 9 వన్డేలు మాత్రమే ఆడి 6 హాఫ్ సెంచరీలు చేశాడు. 2021లో 3 వన్డేలు ఆడి 2 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఈ ఏడాది 6 వన్డేలు ఆడి 2 హాఫ్ సెంచరీలు చేశాడు...

810
Virat Kohli-Rohit Sharma

Virat Kohli-Rohit Sharma

అయినా ఫామ్‌లో లేడనే వంకతో కోహ్లీని బీసీసీఐ సైడ్ చేయాలని చూస్తోందని... దీనికి అసలు కారణం సౌరవ్ గంగూలీతో భారత మాజీ కెప్టెన్ విరాట్‌కి విభేదాలే అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి..

910
Virat Kohli

Virat Kohli

సచిన్ టెండూల్కర్, ఎమ్మెస్ ధోనీ వంటి ప్లేయర్లు వరుసగా విఫలమవుతున్నా వారిని ఏనాడూ జట్టు నుంచి తప్పించే సాహసం చేయలేదు బీసీసీఐ. ఎందుకంటే వాళ్లు జట్టుకి చేసిన సేవలకు బోర్డు ఇచ్చిన గౌరవం అది. ఆ ఇద్దరితో సమానమైన విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం బోర్డు ఈ విధంగా వ్యవహరించడానికి సౌరవ్ గంగూలీయే కారణమంటున్నారు ఫ్యాన్స్...

1010

కారణం ఏదైనా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో విరాట్ కోహ్లీ పేరు లేకపోవడంతో ఇన్ని రకాల ఊహాగానాలు పుట్టుకురావడానికి అతని ఫామ్‌యే కారణం. విరాట్ మునుపటి ఫామ్‌లో ఉండి ఉంటే... టీమ్‌లో నుంచి తప్పించే సాహసం కాదు కదా, అసలు కెప్టెన్సీ తొలగించే ధైర్యం కూడా ఎవ్వరూ చేసేవాళ్లు కాదని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం..

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved