విరాట్ ఒక్కడు, ఎవ్వరికీ అందనంత ఎత్తున... ఐసీసీ అవార్డులపై పేలుతున్న జోక్స్...
First Published Dec 29, 2020, 5:59 AM IST
ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) ప్రకటించిన దశాబ్దపు పురస్కారాలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ముఖ్యంగా టీ20 మెన్స్ టీమ్‌పై, అలాగే ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది డికేట్‌గా ఎంపికైన రషీద్ ఖాన్‌పై సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ వినిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ దశాబ్దంలోనే అత్యధికంగా ఐసీసీ అవార్డులు పొందిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర క్రియేట్ చేశాడు.

2011 నుంచి 2020 మధ్య దశాబ్దకాలంలో భారత క్రికెటర్లు 18 ఐసీసీ అవార్డులు కైవసం చేసుకుని, మిగిలిన దేశాల కంటే టాప్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా 15 ఐసీసీ అవార్డులతో రెండో స్థానంలో ఉంది.

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, వెస్టిండీస్ క్రికెటర్లకి ఒక్కో ఐసీసీ అవార్డు రాగా, ఈ దశాబ్దంలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ప్లేయర్లు ఎవ్వరూ ఐసీసీ అవార్డు పొందలేకపోయారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?