- Home
- Sports
- Cricket
- అప్పుడు ఆండ్రూ ఫ్లింటాఫ్ చేసిన తప్పే, ఇప్పుడు విరాట్ కోహ్లీ చేశాడా... స్లోగా ఆడుతున్న బెయిర్‌స్టోని గెలికి...
అప్పుడు ఆండ్రూ ఫ్లింటాఫ్ చేసిన తప్పే, ఇప్పుడు విరాట్ కోహ్లీ చేశాడా... స్లోగా ఆడుతున్న బెయిర్‌స్టోని గెలికి...
ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీయడానికి సెడ్జింగ్‌ని వాడతారు ప్రత్యర్థి జట్టు ప్లేయర్లు. అయితే కొందరు ప్లేయర్లను సెడ్జింగ్ చేయడం వల్ల కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ వంటి ప్లేయర్లను సెడ్జ్ చేస్తే... వాళ్లను లేపి మరీ తన్నించుకున్నట్టే అవుతుంది. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో అలాంటి పనే చేశాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Virat Kohli Sledges Jonny Bairstow
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో మొదటి రెండు రోజులు టీమిండియా ఆధిపత్యం చెలాయించగా మూడో రోజు తొలి సెషన్‌లో మాత్రం ఇంగ్లాండ్ బ్యాటర్ల డామినేషన్ కొనసాగింది. ఓవర్‌నైట్ స్కోరు 84/5 వద్ద మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్‌కి కెప్టెన్ బెన్ స్టోక్స్, ఇన్ ఫామ్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో కలిసి 66 భాగస్వామ్యం నెలకొల్పి శుభారంభం అందించారు...
మొదటి నాలుగు ఓవర్లు ఇద్దరూ కూడా వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వడంతో సింగిల్స్ మాత్రమే వచ్చాయి. అయితే ఈ దశలో విరాట్ కోహ్లీ, జానీ బెయిర్‌స్టోని సెడ్జింగ్ చేశాడు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టో చాలాసార్లు బౌలర్లను ఆపడంతో... విరాట్ కోహ్లీ ‘నీకు బాల్ తప్ప అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి...’ అంటూ సెడ్జ్ చేశాడు.
Jonny Bairstow
ఈ మాటలకు జానీ బెయిర్‌స్టో కూడా ఏదో మాట అనడంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. బెన్ స్టోక్, అంపైర్లు కూడా కలుగచేసుకుని విరాట్ కోహ్లీని శాంతించాల్సిందిగా కోరారు. దీంతో జానీ బెయిర్‌స్టోని నవ్వుతూ భుజం తట్టిన విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ పొజిషన్‌కి వెళ్లిపోయాడు.
Jonny Bairstow
అయితే ఈ సంఘటన తర్వాత జానీ బెయిర్‌స్టో ఆటతీరు పూర్తిగా మారిపోవడం విశేషం. అప్పటిదాకా చాలా డాట్ బాల్స్ ఆడిన బెయిర్‌స్టో, ఒక్కసారి బ్యాటింగ్ స్టైల్ మార్చేశాడు. ‘నాకు ప్రతీ బాల్ స్పష్టంగా కనబడుతోంది...’ అన్నట్టుగా బౌండరీలతో సమాధానం చెప్పాడు...
Jonny Bairstow-Ben Stokes
మొదటి 64 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసిన జానీ బెయిర్‌స్టో, విరాట్ కోహ్లీతో గొడవ తర్వాత బౌండరీల వర్షం కురిపించాడు.. మొత్తంగా 81 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జానీ బెయిర్‌స్టో, వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 113 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 పరుగులతో క్రీజులో ఉన్నాడు...
Jonny Bairstow
2007 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో యువరాజ్ సింగ్‌ని సెడ్జ్ చేసి, ఆండ్రూ ఫ్లింటాఫ్ చేసిన తప్పే... జానీ బెయిర్‌స్టోని సెడ్జ్ చేసి విరాట్ కోహ్లీ చేశాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ తెగ వైరల్ అవుతున్నాయి.. అసలే ఫామ్‌లో లేని విరాట్, బెయిర్‌స్టోని ఇలా సెడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదని అంటున్నారు నెటిజన్లు...
‘ఎందుకని జానీ బెయిర్‌స్టోకి కోపం తెప్పిస్తున్నారు. ప్రత్యర్థి టీమ్స్ అతనికి కోపి తెప్పించి, బెయిర్‌స్టో 10 రెట్లు మెరుగ్గా ఆడేలా చేస్తున్నారు. వీలైతే అతనికి ఉదయాన్నే ఓ గిఫ్ట్ బాస్కెట్ ఇవ్వడం, అతను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తన కారు మీ పార్కింగ్‌లో ఉండేలా చూసుకోండి. ఏం చేసినా అతను హ్యాపీగా ఉండేలా చూసుకోండి...’ అంటూ ట్వీట్ చేశాడు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీశమ్..
‘విరాట్ కోహ్లీ సెడ్జ్ చేయకుముందు జానీ బెయిర్‌స్టో స్ట్రైయిక్ రేటు 21. ఆ తర్వాత 150. పూజారాలా ఆడుతున్నవాడిని సెడ్జ్ చేసి రిషబ్ పంత్‌ని చేసేశావుగా కోహ్లీ...’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్...