డియర్ అనుష్క... ఈ సెంచరీ నీకోసమే! 71వ సెంచరీని భార్యకి అంకితమిచ్చిన విరాట్ కోహ్లీ...
ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీని ఆడించడం కంటే ఫామ్‌లో ఉన్న కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలి. విరాట్ టెక్నిక్‌లో లోపాలున్నాయి, అతను మళ్లీ ఫామ్‌లోకి రాలేడు... విరాట్ టైమ్ అయిపోలేదు, అతను ఇక ఒడిసిన కథే... ఇలాంటి విమర్శలకు తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు విరాట్ కోహ్లీ... ఇక రాదని హేటర్స్ ఫిక్స్ అయిన 71వ సెంచరీని టీ20 ఫార్మాట్‌లో బాది... ట్రోలింగ్‌కి చెక్ పెట్టేశాడు.
Image credit: Getty
1021 రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆకలిని తీరుస్తూ... టీ20 ఫార్మాట్‌లో మొట్టమొదటి శతకాన్ని అందుకున్నాడు విరాట్ కోహ్లీ.. ఎన్నో నెలలుగా అందుకుండా ఊరిస్తున్న 71 వ సెంచరీని అందుకున్న విరాట్ కోహ్లీ.. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన అతి తక్కువ మంది ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు...
Virat Kohli
33 ఏళ్ల 307 రోజుల వయసులో టీ20ల్లో సెంచరీ బాదిన విరాట్, అతి పెద్ద వయసులో ఈ ఫీట్ సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. 31 ఏళ్ల 299 రోజుల్లో టీ20 సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్‌ని అధిగమించాడు విరాట్ కోహ్లీ...
Image credit: PTI
కెరీర్‌లో 24వేల అంతర్జాతీయ పరుగులను పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, అత్యంత వేగంగా 3500+ టీ20 పరుగులను అందుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే అత్యంత వేగంగా 71వ సెంచరీ అందుకున్న ప్లేయర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...
Virat Kohli
విరాట్ కోహ్లీకి ఇది 522వ ఇన్నింగ్స్ కాగా ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 523 ఇన్నింగ్స్‌ల్లో, రికీ పాంటింగ్ 652వ ఇన్నింగ్స్‌ల్లో 71వ సెంచరీని అందుకున్నారు. అలాగే టీ20ల్లో టీమిండియా తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్‌లో టీ20 ఫార్మాట్‌లో, వన్డే ఫార్మాట్ (183) లో అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.
Image credit: Getty
‘టీ20 ఫార్మాట్‌లో సెంచరీ చేస్తానని నేను పెద్దగా అనుకోలేదు. అందుకే 71వ సెంచరీ ఇలా చేయడం కాస్త షాకింగ్‌గా అనిపించింది. రెండున్నరేళ్లుగా సెంచరీ చేయలేకపోయా. త్వరలో 34 ఏళ్లు నిండబోతున్నాయి...
Virat Kohli
చాలామంది నా ఫామ్ గురించి మాట్లాడారు. 71వ సెంచరీ రావడం లేదని అన్నారు. అయితే నేను మాత్రం ఇప్పటికే చేసిన 70 సెంచరీల గురించే ఆలోచించా. బయట చాలా జరుగుతాయి. అన్నివేళలా నాకు అండగా నిలబడిన వ్యక్తికి ఈ సెంచరీ అంకితం ఇవ్వాలని అనుకుంటున్నా...
డియర్ అనుష్క... ఇది నీకోసం. అలాగే వామిక కోసం కూడా. క్లిష్ట సమయాల్లో కూడా అనుష్క నాకు అండగా నిలబడింది. ఈ నాలుగు వారాల గ్యాప్ నాకెంతో ఉపయోగపడింది. బ్రేక్ తీసుకున్నాకే నేనెంత అలిసిపోయానో అర్థమైంది...
అందుకే కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత నెట్స్‌లో ఎక్కువ సమయం గడిపాను. మళ్లీ పూర్వ ఫామ్‌లోకి వస్తాననే భావన నాలోనే కలిగింది... ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ..