MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఇద్దరు సూపర్ స్టార్స్ కలవాలనుకున్నారు... అంతే, ఇంత రచ్చ జరిగింది! విరాట్ కోహ్లీ, రొనాల్డో మీటింగ్‌కి...

ఇద్దరు సూపర్ స్టార్స్ కలవాలనుకున్నారు... అంతే, ఇంత రచ్చ జరిగింది! విరాట్ కోహ్లీ, రొనాల్డో మీటింగ్‌కి...

క్రీడా ప్రపంచంలో ఇద్దరు సూపర్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, విరాట్ కోహ్లీ... ఫుట్‌బాల్ ప్రపంచంలో రొనాల్డో సూపర్ స్టార్ అయితే, క్రికెట్ ప్రపంచంలో ఆ స్థానం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీదే...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 10 2021, 07:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పోర్చుగల్‌కి చెందిన రొనాల్డో, ప్రస్తుతం మాంచెస్టర్ యూనైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ తరుపున ఆడతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్, ఇండియా మధ్య ఐదో టెస్టు కోసం విరాట్ కోహ్లీ కూడా మాంచెస్టర్‌లో ఉన్నాడు. దీంతో ఈ ఇద్దరూ ఐదో టెస్టు ముగిసిన తర్వాత కలవబోతున్నారని తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో పాటు ఫుట్‌బాల్, క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దీని గురించి ఓ రేంజ్‌లో హడావుడి చేశారు...‘టు కింగ్స్, వన్ సిటీ...’ అంటూ మాంచెస్టర్ యునైటెడ్ ఎఫ్‌సీ ట్వీట్ చేసింది...

38

కేకేఆర్ ప్లేయర్, భారత టెస్టు ప్లేయర్ శుబ్‌మన్ గిల్ కూడా ఈ ఇద్దరి కలయిక గురించి ఓ ఫన్నీ ట్వీట్ చేశాడు... ‘ఎవరికీ తెలియని విషయం: రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్‌లో తిరిగి చేరింది, విరాట్ భాయ్‌ని కలవడానికే’ అంటూ ట్వట్ చేశాడు శుబ్‌మన్ గిల్...

48

అయితే ఈ ఇద్దరు సూపర్ స్టార్లు కలిస్తే... అభిమానుల సంతోషాన్ని తట్టుకోవడం, సోషల్ మీడియాలో ప్రభంజనాన్ని తన వల్ల కాదనేమో డెస్టినీ మరో రకంగా ప్లాన్ మార్చేసింది...

58

షెడ్యూల్ ప్రకారం ఐదో టెస్టు మ్యాచ్ జరిగి ఉంటే, ఆఖరి రోజున అంటే సెప్టెంబర్ 14న సాయంత్రం విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డో మీటింగ్ ఉండేది...

68

అయితే భారత బృందంలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో విరాట్ కోహ్లీతో పాటు టీమ్ మొత్తం క్వారంటైన్‌లోకి వెళ్లింది...

78

అదీకాకుండా ఐపీఎల్ 2021 టోర్నీ దగ్గర పడుతుండడంతో విరాట్ కోహ్లీతో పాటు భారత క్రికెటర్లు అందరూ యూఈఏ బయలుదేరనున్నారు...

88

ఈ హఠాత్ పరిణామాలతో 510+ మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఇద్దరు (రొనాల్డో 360+ మిలియన్, విరాట్ కోహ్లీ 150+ మిలియన్) వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సెలబ్రిటీలను చూసే అదృష్టం మిస్ అయ్యిందని అంటున్నారు అభిమానులు..

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Recommended image2
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Recommended image3
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved