విరాట్ ఖాతాలో మరో రికార్డు... సచిన్ రికార్డును బ్రేక్ చేసిన ‘కింగ్’ కోహ్లీ...
First Published Dec 2, 2020, 10:49 AM IST
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. 242 ఇన్నింగ్స్‌ల్లోనే 12 వేల వన్డే పరుగుల మైలురాయిని అందుకున్న విరాట్, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. వన్డేల్లో మెరుపు వేగంతో పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లీ 8 వేల పరుగుల నుంచి 12 వేల మైలురాయి దాకా అత్యంత వేగంగా ఆ ఫీట్ అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు.

విరాట్ కోహ్లీ వన్డేల్లో తన మొదటి 6 వేల పరుగులను పూర్తిచేసుకునేందుకు 136 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. అయితే ఆ తర్వాత 106 ఇన్నింగ్స్‌ల్లోనే మరో 6 వేల పరుగులు చేశాడు.

242 ఇన్నింగ్స్‌ల్లో 12 వేల మైలురాయి అందుకున్న విరాట్ కోహ్లీ, భారత లెజెండరీ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ ఈ ఫీట్ అందుకునేందుకు 300 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?