- Home
- Sports
- Cricket
- విరాట్ గురించి అప్పుడే విన్నాను, ఓ తరాన్నే నడిపించావ్... సచిన్ టెండూల్కర్ విషెస్...
విరాట్ గురించి అప్పుడే విన్నాను, ఓ తరాన్నే నడిపించావ్... సచిన్ టెండూల్కర్ విషెస్...
కెరీర్‌లో 100వ టెస్టు ఆడబోతున్న విరాట్ కోహ్లీని విష్ చేస్తూ మాజీ క్రికెటర్లు, లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ చెప్పిన మాటలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది బీసీసీఐ...

‘వందో టెస్టు మ్యాచ్ ఆడడం అనేది చాలా అద్భుతమైన అఛీవ్‌మెంట్. మేం 2007-08లో ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు నేను మొదటిసారి విరాట్ కోహ్లీ పేరు విన్నాను...
మీరు మలేషియాలో అండర్ 19 వరల్డ్ కప్ ఆడుతున్నారు. అప్పుడే టీమిండియాలో చాలామంది నీ గురించి మాట్లాడుకున్నారు. బ్యాటింగ్ బాగా చేస్తున్నావంటూ చెప్పారు...
ఆ తర్వాత మనద్దిరం కలిసి టీమిండియాకి ఆడాం. నీతో ఎక్కువ సమయం కలిసి ఆడకపోయినా నీలో నేర్చుకోవాలనే తపన, తాపత్రయం నేను గమనించాను..
నిన్ను నువ్వు మరింతగా మెరుగుపర్చుకునేందుకు ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నావు... ఎన్నేళ్లుగా నీ ఆటను చూస్తూ ఎంతో ఎంజాయ్ చేశా...
నీ గణాంకాలు నువ్వు సాధించవేంటో చూపిస్తాయి, అయితే నీ నిజమైన బలం ఏంటంటే నువ్వు ఓ తరాన్నే మోటివేట్ చేయగల సత్తా ఉన్న నాయకుడివి...
భారత క్రికెట్ జట్టుకి నువ్వు అందించిన సేవలు విలువ కట్టలేనివి. అదే నీ నిజమైన సక్సెస్. నువ్వు ఇలా మరిన్ని మ్యాచులు ఆడాలని కోరుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సచని్ టెండూల్కర్...
‘విరాట్ కెరీర్ అద్భుతంగా సాగింది. మొదటి మ్యాచ్‌లో కూడా విరాట్ కోహ్లీ ముఖంలో భయం కనిపించలేదు. తన తొలి టెస్టులో ఎడ్వర్డ్స్ వేసిన బౌన్సర్లను విరాట్ ఆడిన విధానం నాకు ఇప్పటికీ గుర్తుంది...
అప్పటికి వరల్డ్‌లో ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉన్న ఫిడెల్ ఎడ్వర్డ్స్‌ను ఎదుర్కోవడానికి కూడా విరాట్ కోహ్లీ భయపడలేదు. విరాట్ లెజెండ్‌గా మారతాడని నేను అప్పుడే అంచనా వేశా...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
‘నువ్వు కేవలం భారత క్రికెట్ ఫ్యాన్స్‌నే కాదు, వరల్డ్ క్రికెట్ ఫ్యాన్స్‌నే నీ వైపు చూసేలా చేసుకున్నాం. నీ అభిమానుల్లా మార్చుకున్నావ్...
టెస్టు క్రికెటర్‌గా, లీడర్‌గా నీ ప్రస్తానం నిన్ను నేనెంతో ఇష్టపడతాను. వందల కోట్ల మంది అంచనాలను అందుకుంటూ రాణించడం అంత తేలికైన విషయం కాదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్...
‘విరాట్ కోహ్లీపై ఎప్పుడూ ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ ప్రెషర్‌ను విరాట్ చాలా పాజిటివ్‌గా తీసుకుంటాడు. 100 టెస్టులు ఆడడం అంటే అదే పెద్ద ఘనత...
ప్రపంచంలో అన్ని చోట్లా సూపర్ సక్సెస్ అయిన విరాట్ కోహ్లీ, ఎప్పుడూ కష్టపడడానికి సిద్ధంగా ఉంటాడు. అతను తన ప్రతీ అఛీవ్‌మెంట్‌కి పూర్తిగా అర్హుడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...