- Home
- Sports
- Cricket
- ఎంత బాగా ఆడినా రహానే ప్లేస్‌కి గ్యారెంటీ లేదు! నెక్ట్స్ టార్గెట్ అతనే... ఆకాశ్ చోప్రా కామెంట్స్...
ఎంత బాగా ఆడినా రహానే ప్లేస్‌కి గ్యారెంటీ లేదు! నెక్ట్స్ టార్గెట్ అతనే... ఆకాశ్ చోప్రా కామెంట్స్...
ఐపీఎల్ 2023 పర్ఫామెన్స్‌తో టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చి, ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చేసిన పరుగులతో తిరిగి టెస్టు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు అజింకా రహానే. అయితే అతని ప్లేస్‌కి ఏ మాత్రం గ్యారెంటీ లేదంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా..

Ajinkya Rahane
ఐపీఎల్ 2023 సీజన్‌లో 172.48 స్ట్రైయిక్ రేటుతో 326 పరుగులు చేసిన అజింకా రహానే, 2022-23 రంజీ ట్రోఫీ సీజన్‌లో 57.63 యావరేజ్‌తో 634 పరుగులు చేశాడు. అయితే అతని రీఎంట్రీకి ఈ పర్ఫామెన్స్ కంటే శ్రేయాస్ అయ్యర్ గాయపడడమే ప్రధాన కారణం..
Ajinkya Rahane
శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ ఇద్దరూ గాయపడడంతో మరో దారి లేక అజింకా రహానేకి టీమ్‌కి సెలక్ట్ చేశారు సెలక్టర్లు. ప్రస్తుత టీమ్‌లో అంతో కొంతో టెస్టులకు కెప్టెన్సీ చేసిన అనుభవం ఉన్న ప్లేయర్ కావడంతో వైస్ కెప్టెన్సీ తిరిగి అప్పగించారు..
‘అజింకా రహానే, టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్నా, అతని ప్లేస్‌కి భరోసా లేదు. 18 నెలల తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ ఇస్తూ, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఇంప్రెస్ చేశాడని అతనికి వైస్ కెప్టెన్సీ ఇచ్చేశారు. వైస్ కెప్టెన్ అయినంత మాత్రాన టీమ్‌లో ప్లేస్ ఉంటుందనే భరోసా లేదు..
Ajinkya Rahane
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా అజింకా రహానే వైస్ కెప్టెన్‌గా సేవలు అందించాడు. సౌతాఫ్రికా టూర్‌లో అతని వైస్ కెప్టెన్సీ తొలగించారు. ఆ తర్వాత టీమ్ నుంచి కూడా. ఈ టెస్టు సిరీస్‌లోనూ అంతే..
Ajinkya Rahane
టీమ్‌లో స్థిరమైన చోటు ఉండాలంటే అజింకా రహానే పరుగులు చేస్తూనే ఉంటాడు. పరుగులు చేయలేకపోతే ఇంతకుముందు వైస్ కెప్టెన్ ట్యాగ్, అతన్ని కాపాడలేదు. శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ ఫిట్‌నెస్ సాధిస్తే, అజింకా రహానేని కొనసాగిస్తారా? అనేది అనుమానమే..
ఛతేశ్వర్ పూజారా తర్వాత ఇప్పుడు సెలక్టర్ల నెక్ట్స్ టార్గెట్ అజింకా రహానేనే. అతను ఫెయిల్ అయితే తిరిగి టీమ్ నుంచి తొలగించడానికి టీమ్ మేనేజ్‌మెంట్ ఏ మాత్రం ఆలోచించదు.. కాబట్టి ఆ ప్లేస్‌ని కాపాడుకోవాల్సిన బాధ్యత అతనిదే.. ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా..