- Home
- Sports
- Cricket
- నా పిల్లలు మాత్రం క్రికెట్ ఆడకూడదని అనుకుంటున్నా... ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా షాకింగ్ కామెంట్స్...
నా పిల్లలు మాత్రం క్రికెట్ ఆడకూడదని అనుకుంటున్నా... ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా షాకింగ్ కామెంట్స్...
సినిమా హీరోలు, తమ పిల్లలను హీరోలుగా మార్చాలనుకోవడం, క్రికెటర్లు, తమ వారసులను క్రికెటర్లుగా చూడాలనుకోవడం చాలా కామన్. సునీల్ గవాస్కర్ కొడుకు రోహాన్ గవాస్కర్, రోజర్ భిన్నీ కొడుకు స్టువర్ట్ బిన్నీతో పాటు పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ నుంచి చాలామంది వారసులు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు..

సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. అయితే ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా మాత్రం తన వారసులు, క్రికెట్‌లోకి రాకూడదని కోరుకుంటున్నట్టు షాకింగ్ కామెంట్లు చేశాడు..
Usman Khawaja
‘నేను క్రికెట్ నుంచి వచ్చా, క్రికెట్‌ని చూస్తూ పెరిగా. అందుకే నా పిల్లలు మాత్రం ఇటు వైపు రాకూడదని గట్టిగా కోరుకుంటున్నా. ఎందుకంటే క్రికెట్ చూడడానికి వచ్చే వారిలో 100 శాతం మంది ఏదో ఒక విమర్శ చేసి వెళ్తారు..
కొందరు వాగే వాగుడు మరీ చెత్తగా ఉంటుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో ట్రావిస్ హెడ్‌ని బూతులు తిట్టారు. అలాంటి మాటలు, ఎక్కడా మాట్లాడలేం, చెప్పలేం కూడా.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకి వచ్చినా ఇదే జరుగుతుంది. వాళ్లకు ఆసీస్‌లో ఇదే రకమైన అనుభవం ఎదురవుతుంది..
ఆస్ట్రేలియా అయితే క్రికెటర్లను తిట్టే విషయంలో చాలా ముందుకు వెళ్లిపోయింది. నాకు ఇది అస్సలు నచ్చదు. నేను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రీడలు చూశాను. ఎన్‌బీఏలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. జనాలు, ఆటను, టీమ్‌ని తమ సొంత టీమ్‌గా ఫీల్ అవుతారు. అందుకే ఇలాంటివన్నీ జరుగుతాయి..
Usman Khawaja
యాషెస్ సిరీస్‌లో మూడు మంచి మ్యాచులు చూశాం. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అయితే ఎక్కువ మంది వీక్షించిన టెస్టు మ్యాచ్‌గా నిలిచింది. అయితే ఏం లాభం 80 శాతం ఫైన్ వేశారు. అది చాలా ఎక్కువ..
Usman Khawaja
ఐదు రోజులు ఆడిన తర్వాత 80 శాతం మ్యాచ్ ఫీజును కోల్పోతే చాలా ఫ్రస్టేషన్ వస్తుంది. ఆట అనేది ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి. అదే జరుగుతోంది. టెస్టు క్రికెట్‌ని బతికించాలని ఇలా జరిమానాలు వేయడం తగ్గించాలి...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా..