- Home
- Sports
- Cricket
- టీమిండియాలో సాయి సుదర్శన్ ప్లేస్ కన్ఫార్మ్!.. అతను కావాల్సిందే అంటున్న హార్ధిక్ పాండ్యా?...
టీమిండియాలో సాయి సుదర్శన్ ప్లేస్ కన్ఫార్మ్!.. అతను కావాల్సిందే అంటున్న హార్ధిక్ పాండ్యా?...
ఒకప్పుడు టీమిండియాలో ముంబై ఇండియన్స్ ప్లేయర్ల డామినేషన్ నడిచింది. జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్.. ఇలా ముంబైకి ఆడిన యంగ్ ప్లేయర్లకు టీమిండియాలో చోటు దక్కింది. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ డామినేషన్ మొదలవ్వబోతోంది..

Sai Sudharsan
ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఆరంగ్రేటం చేసి, టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యా.. టీ20 టీమ్‌లో తన టీమ్‌మేట్స్‌కి అగ్రతాంబూలం దక్కాలని డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి...
ఐపీఎల్ 2023 సీజన్‌లో 25 వికెట్లు తీసి, అద్భుతమైన కమ్‌బ్యాక్ పర్ఫామెన్స్ ఇచ్చిన మోహిత్ శర్మ, 8 ఏళ్ల తర్వాత భారత జట్టు తరుపున ఆడడం దాదాపు ఖాయమైపోయింది... వెస్టిండీస్ టూర్‌లో టీ20 సిరీస్‌కి ప్రకటించే జట్టులో మోహిత్ పేరు ఉండడం దాదాపు ఖాయమే...
అలాగే ఐపీఎల్ 2023 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్‌కి టీ20 టీమ్‌లో అవకాశం దొరకబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి...
ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్‌లో 47 బంతుల్లో 96 పరుగులు చేసి, గుజరాత్ టైటాన్స్‌కి భారీ స్కోరు అందించిన సాయి సుదర్శన్, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోనూ అదే ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు...
తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో 45 బంతుల్లో 86 పరుగులు చేసిన సాయి సుదర్శన్, రెండో మ్యాచ్‌లో 52 బంతుల్లో 90 పరుగులు చేశాడు. మూడో మ్యాచ్‌లో 43 బంతుల్లో 64 పరుగులు చేశాడు. వరుసగా 3 మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు అందుకున్నాడు..
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్‌కి వెస్టిండీస్ టూర్‌లో టీ20 టీమ్‌లో చోటు దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.
ఇదే జరిగితే హార్ధిక్ పాండ్యా, శుబ్‌మన్ గిల్, మహ్మద్ షమీ ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ నుంచి టీమిండియాకి ఆడుతుండగా మోహిత్ శర్మ, సాయి సుదర్శన్ రూపంలో మరో ఇద్దరు చేరినట్టు అవుతుంది.