దూసుకొస్తున్న బుల్లెట్... జస్ప్రిత్ బుమ్రా రికార్డును లేపేసిన ఉమ్రాన్ మాలిక్...
ఉమ్రాన్ మాలిక్, ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన స్పీడ్ గన్. దేశవాళీ టోర్నీల్లో పెద్దగా అనుభవం కూడా లేని ఓ బౌలర్ గురించి క్రికెట్ ప్రపంచమంతా చర్చించుకోవడానికి కారణం అతని స్పీడ్. ఐపీఎల్‌లో 150+ వేగంతో బంతులు విసిరిన ఉమ్రాన్ మాలిక్, అంతర్జాతీయ క్రికెట్‌లోనూ తన మార్కు చూపిస్తున్నాడు...

Umran Malik
శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 155 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసి, అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఉమ్రాన్ మాలిక్...
Image credit: Getty
163 లక్ష్యఛేదనలో శ్రీలంక కెప్టెన్ ధసున్ శనక, 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేసి భారత జట్టును భయపెట్టాడు. హాఫ్ సెంచరీకి చేరువైన ధసున్ శనకని ఫాస్టెస్ట్ డెలివరీతో కంగుతినిపించాడు ఉమ్రాన్ మాలిక్. 155 కి.మీ.ల వేగంతో దూసుకొచ్చిన బంతి, శనక బ్యాటును తాకుతూ వెళ్లి యజ్వేంద్ర చాహాల్ చేతుల్లో వాలింది...
దీనికి ముందు కూడా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు శనక. శనక బ్యాటు అంచుకు తాకుతూ వెళ్లిన బంతిని ఇషాన్ కిషన్ క్యాచ్ అందుకున్నాడు. అయితే క్యాచ్ అందుకోవడానికి ముందు బంతి నేలను తాకినట్టు టీవీ రిప్లైలో తేలింది.. ఆ తర్వాతి బంతికే వికెట్ సాధించాడు ఉమ్రాన్ మాలిక్...
4 ఓవర్లలో 27 పరుగులిచ్చిన ఉమ్రాన్ మలిక్, 2 కీలక వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంతకుముందు 2018-19 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్టులో 153.2 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా...
Image credit: PTI
భారత జట్టు తరుపున అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన బౌలర్‌గా జస్ప్రిత్ బుమ్రా రికార్డును ఉమ్రాన్ మాలిక్ చెరిపేశాడు. అవకాశం వస్తే 160+ వేగంతో బౌలింగ్ చేసి షోయబ్ అక్తర్ రికార్డు లేపేస్తానని చెప్పిన తర్వాతి రోజే, బుమ్రా రికార్డును తిరగరాశాడు ఉమ్రాన్ మాలిక్..