- Home
- Sports
- Cricket
- Umpires Remuneration: క్రికెట్ అంపైర్ల జీతం ఎంత? ఒక్కో మ్యాచ్‌కు ఎంత తీసుకుంటారో తెలుసా?
Umpires Remuneration: క్రికెట్ అంపైర్ల జీతం ఎంత? ఒక్కో మ్యాచ్‌కు ఎంత తీసుకుంటారో తెలుసా?
Cricket Umpires’ Salary: క్రికెట్ లో అంపైర్లు మ్యాచ్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారు. అయితే, అంపైర్లు ఒక మ్యాచ్ కు ఎంత జీతం అందుకుంటారో తెలుసా? భారత్ లో అంపైర్ల వేతనం ఎంత?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Cricket Umpires’ Income: How Much Do They Make in International and IPL Matches?
Umpires' Remuneration in Cricket: క్రికెట్.. ప్రపంచంలో అత్యధిక మంది ఇష్టమైన క్రీడల్లో ఒకటి. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ ప్లేయర్లు భారీగానే సంపాదిస్తున్నారు. ఒక్కో మ్యాచ్ కు లక్షల్లో పారితోషికం అందుకుంటున్న ప్లేయర్లు ఉన్నారు. బ్రాండ్ ఎండార్స్ మెంట్లతో భారీగానే సంపాదిస్తున్నారు. అయితే, మ్యాచ్ నిర్వహణలో కీలక పాత్ర పోషించే వారిలో ఎంపైర్లు కూడా ఉంటారు. క్రికెట్ లో ఎంఫైరింగ్ రెమ్యునరేషన్ ఎంత? ఒక్క మ్యాచ్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?
How Much Do Cricket Umpires Get Paid for a Match?
క్రికెట్‌లో అంపైర్లు ఎంత జీతం తీసుకుంటారు?
క్రికెట్‌లో అంపైర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మ్యాచ్ ను నియమాల ప్రకారం నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తారు. మ్యాచ్ లో ఎలాంటి తప్పులకు తావులేకుండా మ్యాచ్ ను నిర్వహిస్తారు.. నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, మ్యాచ్ లలో అంపైర్లు తీసుకునే వేతనం మ్యాచ్ మ్యాచ్ కు వేరువేరుగా ఉంటుంది. అంటే దేశవాళీ క్రికెట్, అంతర్జాతీయ క్రికెట్, లీగ్ మ్యాచ్ లలో వేరువేరుగా పారితోషకాలు అపైర్లు అందుకుంటారు. ఆయా దేశాల క్రికెట్ బోర్డులపై కూడా ఆధారపడి మారుతుంది.
అంతర్జాతీయ స్థాయిలో అంపైర్ల పారితోషికం స్థానిక క్రికెట్ కంటే చాలా ఎక్కువ. అంతర్జాతీయ క్రికెట్ కన్వీనింగ్ చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), అంతర్జాతీయ అంపైర్లకు పారితోషికాన్ని నిర్ణయిస్తుంది. వారి క్రికెట్ స్థాయిల ప్రమాణాలు కూడా ఇందులో కీలకంగా ఉంటాయి. టెస్టు క్రికెట్, వన్డేలు, టీ20 మ్యాచ్ లను బట్టికూడా ఇది మారుతుంది.
టెస్టు మ్యాచ్ లకు ఒక మ్యాచ్ కు సుమారు 2,000 నుండి 3,000 డాలర్లు (సుమారు ₹1,50,000 నుండి ₹2,50,000) అంపైర్లు వేతనంగా అందుకుంటారు. వన్డేల్లో ఇది 1,500 నుండి 2,000 డాలర్లు, టీ20 క్రికెట్ లో 1,500 నుండి 2,000 డాలర్లు మధ్య పారితోషికం ఉంటుంది. అయితే, ఇది సిరీస్ లేదా ఈవెంట్ ఆధారంగా మారుతుంది.
కేవలం మ్యాచ్ ఫీజులు మాత్రమే కాకుండా అదనంగా అంపైర్లకు ప్రయాణం, నివాసం, భోజనం ఖర్చులు అందిస్తారు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ICC చాంపియన్స్ ట్రోఫీలలో అంపైర్లు పనిచేస్తే వారికి బోనస్లు, ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి.
Umpires in Cricket: Earnings for Test, ODI, T20, and IPL Matches
భారత దేశవాళీ క్రికెట్ లో అంపైర్ల మ్యాచ్ ఫీజు ఎంత?
భారత్ లో రంజీ ట్రోఫీలో అంపైర్లు ప్రతి మ్యాచ్‌కు సుమారు 30,000 నుండి 40,000 రూపాయలు సంపాదిస్తారు. లిస్ట్ A, T20 దేశీయ మ్యాచ్‌లలో అంపైర్ల పారితోషికం సుమారు 20,000 నుండి 30,000 రూపాయలు ఉంటుంది. ఇది అంతర్జాతీయ మ్యాచ్‌లతో పోలిస్తే చాలా తక్కువ, కానీ తక్కువ స్థాయి మ్యాచ్‌లలో అంపైర్లకు గౌరవప్రదమైన మొత్తంగా చెప్పవచ్చు. ఐపీఎల్ వంటి దేశీయ లీగ్ లలో అంపైర్లకు భారీగానే మ్యాచ్ ఫీజును అందిస్తారు.