ప్రపంచ క్రికెట్‌లో ఈ టాప్-5 రికార్డులను బ్రేక్ చేయడం అసాధ్యం.. !
Unbreakable World Records of Cricket: క్రికెట్‌లో అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొంతమంది గొప్ప బ్యాట్స్‌మెన్, గొప్ప బౌలర్లు చాలా రికార్డులనే సృష్టించారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ప్రపంచ క్రికెట్ లో ఆ రికార్డులను బ్రేక్ చేయడం అసాధ్యం.. !
sachin lara muralitharan
Unbreakable World Records of Cricket: క్రికెట్‌లో బ్రేక్ చేయలేని ప్రపంచ రికార్డులు చాలానే ఉన్నాయి. బ్రేక్ చేయడం అసాధ్యంలా కనిపిస్తున్న టాప్-5 రికార్డులు ఇలా ఉన్నాయి..
1. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 199 సెంచరీలు, 273 హాఫ్ సెంచరీలు, 61760 పరుగులు
ఇంగ్లండ్ గ్రేట్ బ్యాట్స్‌మెన్ సర్ జాక్ హాబ్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొత్తం 61760 పరుగులు చేశాడు. ఇందులో 199 సెంచరీలు 273 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. సర్ జాక్ హాబ్స్ 1 జనవరి 1908న ఆస్ట్రేలియాతో తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 61 టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లలో 5,410 పరుగులు చేయగా, ఇందులో 15 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
2. బ్రాడ్‌మాన్ సగటు 99
క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అయిన ఆస్ట్రేలియా ఆటగాడు డొనాల్డ్ బ్రాడ్‌మన్ తన జీవితంలో కేవలం 52 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. తన కెరీర్‌లో 6996 టెస్టు పరుగులు చేశాడు. అయితే, అతని బ్యాటింగ్ సగటు 99.94. ఇది క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్ లో అయినా అత్యధికం. ఈ రికార్డును బద్దలు కొట్టడం ఇప్పటి బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కాదు. ఇది మాత్రమే కాదు, టెస్టుల్లో అత్యధికంగా 12 డబుల్ సెంచరీలు కూడా సర్ డాన్ బ్రాడ్‌మన్ పేరు మీదనే ఉన్నాయి. అలాగే, ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా అతనికి ఉంది. ఇంగ్లండ్‌పై 5028 పరుగులు చేశాడు.
3. మురళీధరన్ అత్యధిక వికెట్లు
శ్రీలంక దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 1347 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రపంచ రికార్డును బ్రేక్ చేయడం అసాధ్యం. ముత్తయ్య మురళీధరన్ తన కెరీర్‌లో 133 టెస్టులు, 350 వన్డేలు, 12 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు మరియు వీటన్నింటిలో మొత్తం 1347 వికెట్లు పడగొట్టాడు. ఏ ఆటగాడు తన ప్రపంచ రికార్డుకు చేరువగా వెళ్తున్నవారు లేరు.
4. వన్డేలో సచిన్ టెండూల్కర్ 18426 పరుగులు
లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ తన 22 సంవత్సరాల 91 రోజుల సుదీర్ఘ వన్డే కెరీర్ లో 463 వన్డే మ్యాచ్‌లలో 452 ఇన్నింగ్స్‌లలో 44.83 సగటుతో 18426 పరుగులు చేశాడు. ఈ కాలంలో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు సాధించాడు. సచిన్ టెండూల్కర్ వన్డే అంతర్జాతీయ కెరీర్‌లో అజేయంగా 200 పరుగులు చేయడం అత్యుత్తమ స్కోరు. ప్రస్తుతం చాలా తక్కువగా ఆడుతున్న వన్డే మ్యాచ్ సమయంలో ఈ రికార్డును బ్రేక్ చేయడం బ్యాటర్లకు అంత సులభం కాదు.
Cricket Fans
5. నైట్ వాచ్‌మన్ గా వచ్చి డబుల్ సెంచరీ కొట్టాడు.. !
టెస్ట్ క్రికెట్‌లో బ్యాటింగ్ జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్ వికెట్‌ను రోజు చివరిలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రక్షించాలనుకున్నప్పుడు నైట్ వాచ్‌మెన్ బ్యాటింగ్ చేయడానికి వస్తాడు. ఇలా వచ్చి టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన నైట్ వాచ్‌మెన్ కూడా ఉన్నాడు అతనే జాసన్ గిల్లెస్పీ. 2006లో, చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాసన్ గిల్లెస్పీ నైట్ వాచ్‌మెన్‌గా అజేయంగా 201 పరుగులు చేశాడు.