ఈ ఇన్నింగ్స్ నాన్నకే అంకితం... కన్నీళ్లు పెట్టుకున్న కృనాల్ పాండ్యా...
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డే ద్వారా వన్డేల్లో ఆరంగ్రేటం చేసిన ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, తన మొట్టమొదటి వన్డే మ్యాచ్‌లోనే అదిరిపోయే ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు... మ్యాచ్‌కి ముందు, ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత కూడా ఎమోషనల్ అయ్యాడు కృనాల్ పాండ్యా...

31 బంతుల్లో 7 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 58 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా... ఆరంగ్రేటం మ్యాచ్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ అందుకున్న ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కృనాల్ పాండ్యా, ఆరంగ్రేటం మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2009లో ఆరంగ్రేటం చేసిన రవీంద్ర జడేజా 60 పరుగులతో టాప్‌లో ఉన్నాడు...

పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న కెఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా ఇన్నింగ్స్ తర్వాత ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ ఇద్దరూ 57 బంతుల్లో 112 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా భారీ స్కోరు చేయడానికి కారణమయ్యారు...

ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న కృనాల్ పాండ్యా, ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత తన తమ్ముడు హార్ధిక్ పాండ్యాను కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యాడు.

ఇన్నింగ్స్ తర్వాత మీడియాతో ముచ్చడించడానికి వచ్చిన కృనాల్ పాండ్యా... ‘ఈ ఇన్నింగ్స్ నాన్న కోసం’ అంటూ ఏడ్చేశాడు. ఆ తర్వాత మాట్లాడలేకపోయిన కృనాల్ పాండ్యా, అక్కడి నుంచి వెళ్లిపోయాడు...

ఆరంగ్రేటం సమయంలో తన తమ్ముడు హార్ధిక్ పాండ్యాతో కృనాల్ పాండ్యాకి వన్డే క్యాప్ అందించారు కెప్టెన్ విరాట్, కోచ్ రవిశాస్త్రి. తమ్ముడి నుంచి వన్డే క్యాప్ అందుకున్న కృనాల్ పాండ్యా, ఆకాశానికి పైకెత్తి చూపించి, తండ్రిని గుర్తు చేసుకున్నాడు...

అన్న కృనాల్ పాండ్యాకి బ్యాటింగ్ ఆడే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే హార్ధిక్ పాండ్యా 9 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడేమోనని అనుమానిస్తున్నారు అభిమానులు...

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ సమయంలో పాండ్యా బ్రదర్స్ తండ్రి హిమాన్షు పాండ్యా అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే... ఆ తర్వాత జరిగిన విజయ్ హాజారే ట్రోఫీలో అదరగొట్టిన కృనాల్ పాండ్యా, వన్డే జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.