పాక్ పరువు మళ్లీ పాయే!... ది హండ్రెడ్‌లో అమ్ముడుపోని బాబర్ ఆజమ్, రిజ్వాన్...
పాక్ క్రికెటర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్... ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 1, 2 స్థానాల్లో ఉన్నారని... ఇలాంటి ప్లేయర్లు లేరని టీమిండియా తెగ ఫీలైపోతుందని నానా హడావుడి చేస్తున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్... అయితే గత ఏడాది టీ20ల్లో పరుగుల వరద పారించిన ఈ ఇద్దరినీ ‘ది హండ్రెడ్’ టోర్నీలో ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు...

Image Credit: Getty Images
ఐపీఎల్ వేలంలో బాబర్ ఆజమ్‌ని అనుమతిస్తే, అతను కచ్ఛితంగా రూ.15 నుంచి 20 కోట్ల వరకూ ధర పలుకుతాడని కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...
దానికి తగ్గట్టుగా బాబర్ ఆజమ్, ‘ది హండ్రెడ్’ లీగ్‌లో అత్యధిక ధర కేటగిరీకి రిజిస్టర్ చేయించుకున్నాడు. 125 వేల పౌండ్ల స్టీప్‌లో రిజిస్ట్ చేయించుకున్నాడు బాబర్ ఆజమ్...
అయితే వరల్డ్ నెం.1 టీ20 ర్యాంకర్‌ని కొనుగోలు చేయడానికి ‘ది హండ్రెడ్’ లీగ్ ఫ్రాంఛైజీలేవీ ఆసక్తి చూపించలేదు. బాబర్ ఆజమ్‌తో పాటు పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ కూడా అమ్ముడుపోలేదు...
Babar Azam
‘ది హండ్రెడ్’ లీగ్‌లో పాక్ స్టార్ క్రికెటర్లు అమ్ముడుపోకపోవడంతో టోర్నీ మొదలయ్యే సమయానికి వేరే సిరీస్‌తో బిజీగా ఉంటారని, అందుకే ఫ్రాంఛైజీలు వారిని కొనుగోలు చేయలేదని ప్రచారం మొదలెట్టారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్...
ఈ ఇద్దరితో పాటు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌లను కొనుగోలు చేయడానికి కూడా ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు...
Image Credit: Getty Images
వెస్టిండీస్ క్రికెటర్ ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్‌తో పాటు సౌతాఫ్రికా క్రికెటర్, టీ20 నెం.1 స్పిన్నర్ తంబ్రేజ్ షంసీ కూడా వేలంలో అమ్ముడుపోని ప్లేయర్ల లిస్టులో ఉన్నారు...
కిరన్ పోలార్డ్, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, డ్వేన్ బ్రావో వంటి వెస్టిండీస్ ప్లేయర్లు ‘ది హండ్రెడ్ డ్రాఫ్ట్’లో టాప్ బిడ్స్ సొంతం చేసుకున్నారు...