ముగిసిన మూడో రోజు ఆట... స్వల్ప ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా... ఆదుకున్న గ్రీన్, కమ్మిన్స్...

First Published Dec 28, 2020, 12:47 PM IST

బాక్సింగ్ డే టెస్టులో వరుసగా మూడో రోజు కూడా టీమిండియా ఆధిక్యమే నడిచింది. ఓవర్ నైట్ స్కోరు 277/5 పరుగుల వద్ద మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా... 326 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు 131 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బౌలర్లు సత్తా చాటారు. 99 పరుగులకే 6 వికెట్లు తీసి ఆతిథ్య ఆస్ట్రేలియాకి ఊహించని షాక్ ఇచ్చారు.

జో బర్న్స్ 4, లబుషేన్ 28, స్టీవ్ స్మిత్ 8, ట్రావిస్ హెడ్ 17, టిమ్ పైన్ 1 పరుగు చేయగా మాథ్యూ వేడ్ 40 పరుగులతో హై స్కోరర్‌గా నిలిచాడు.

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 2 వికెట్లు తీయగా, బుమ్రా, ఉమేశ్ యాదవ్, సిరాజ్, అశ్విర్ తలా ఓ వికెట్ తీశారు.

99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా... ఈరోజే ఆలౌట్ అవుతుందని భావించినా కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమ్మిన్స్ కలిసి ఆసీస్‌ను ఆదుకున్నారు.

ఈ ఇద్దరూ 112 బంతుల్లో 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. భారత జట్టు స్కోరుకి 9 పరుగుల దూరంలో ఉన్నప్పుడు కమ్మిన్స్ ఇచ్చిన క్యాచ్‌ను రిషబ్ పంత్ జారవిరిచాడు.

2018 నుంచి ఇప్పటిదాకా టెస్టుల్లో 11 క్యాచులను నేలపాలు చేశాడు రిషబ్ పంత్. ఈ మూడేళ్లలో మరే కీపర్ కూడా ఇన్ని క్యాచులు జారవిడచలేదు.

కామెరూన్ గ్రీన్ 65 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు, ప్యాట్ కమ్మిన్స్ 53 బంతుల్లో 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ప్రస్తుతం 2 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా చేతిలో 4 వికెట్లు ఉన్నాయి.

టెయిలెండర్లు రాణిస్తుండడంతో భారత జట్టు ఆస్ట్రేలియా మిగిలిన నాలుగు వికెట్లను ఎంత త్వరగా తీస్తుందనే దానిపైనే విజయం ఆధారపడి ఉంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?