నా వల్ల కాదు బాబోయ్! హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రావిడ్ గుడ్‌బై... ఆ టోర్నీ ముగిసిన తర్వాత...
టీమిండియా క్రికెటర్‌గా, అండర్19 హెడ్ కోచ్‌గా, ఎన్‌సీఏ హెడ్‌గా క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్నాడు రాహుల్ ద్రావిడ్. సౌరవ్ గంగూలీ తర్వాత టీమిండియా కెప్టెన్‌గానూ వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్.. భారీ అంచనాలతో హెడ్ కోచ్ పదవి స్వీకరించాడు...
రవిశాస్త్రి నుంచి టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు అందుకున్నాడు రాహుల్ ద్రావిడ్. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా ఓడిపోయిన ప్రతీసారీ... అతనిపై బీభత్సమైన ట్రోలింగ్ వచ్చేది. అతన్ని తప్పించి, వెంటనే ద్రావిడ్‌కి హెడ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వినిపించేది...
Image credit: Getty
ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ బతిమాలి, బామాలి ఒప్పించి... టీమిండియా హెడ్ కోచ్‌గా నియమించాడు. అయితే ద్రావిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాక అభిమానులు, భారత క్రికెట్ బోర్డు పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు..
Image credit: PTI
రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాక బీసీసీఐతో విభేదాలతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం... రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చినా ఫిట్‌నెస్ సమస్యలతో ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లను మార్చాల్సి రావడం వంటి సంఘటనలు భారత జట్టును తీవ్రంగా ప్రభావితం చేశాయి...
Image credit: PTI
దీనికి తోడు అనవసర ప్రయోగాలు, రకరకాల టీమ్ కాంబినేషన్లను ప్రయత్నించిన రాహుల్ ద్రావిడ్... అనుకున్న రిజల్ట్‌ని రాబట్టలేకపోయాడు. ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ వైఫల్యాల తర్వాత ద్రావిడ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి...
రాహుల్ ద్రావిడ్ కంటే ఆ రవిశాస్త్రియే చాలా బెటర్‌గా కోచింగ్ చేశాడనే అభిప్రాయలు వినిపించాయి. రవిశాస్త్రి కోచింగ్‌లో ఐసీసీ టైటిల్స్ గెలవకపోయినా మరీ బంగ్లాదేశ్‌తో సిరీస్ ఓడిపోయేలా టీమిండియా ఆటతీరు దిగజారలేదని విమర్శలు వచ్చాయి..
క్రికెటర్‌గా కొన్ని దశాబ్దాల పాటు కష్టపడి తెచ్చుకున్న మంచి పేరు, క్లీన్ ఇమేజ్... ఈ ఏడాది కాలంలో తుడిచిపెట్టుకుపోయింది. దీంతో హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యాడట రాహుల్ ద్రావిడ్...
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీతో హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ గడువు ముగియనుంది. గత ఏడాదిన్నరగా ఎదుర్కొంటున్న అనుభవాలతో హెడ్ కోచ్‌గా కొనసాగేందుకు రాహుల్ ద్రావిడ్ సిద్ధంగా లేడని వార్తలు వస్తున్నాయి..
రాహుల్ ద్రావిడ్ స్థానంలో ఎన్‌సీఏ హెడ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్, భారత జట్టు తర్వాతి కోచ్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా తీవ్రమైన ట్రోలింగ్ ఫేస్ చేసిన వీవీఎస్ లక్ష్మణ్... టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు తీసుకుంటే మరెన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందో మరి...