జింబాబ్వే కంటే ఘోరంగా భారత బౌలింగ్... శ్రీలంకతో తొలి వన్డేలోనూ అదే సీన్...
శ్రీలంక టూర్‌లో కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న శిఖర్ ధావన్, వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఇద్దరూ కలిసి 261 వన్డే మ్యాచులు ఆడితే, శ్రీలంక జట్టులోని అందరూ కలిసి ఆడింది 220 వన్డేలే. అయితే పెద్దగా అనుభవం లేని లంక బ్యాట్స్‌మెన్ కూడా పవర్ ప్లేలో భారత బౌలర్లను చక్కగా ఎదుర్కొన్నారు...

తొలి వన్డేలో ఓపెనింగ్ స్పెల్ వేసిన ‘స్వింగ్ కింగ్’ భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్ తొలి 8 ఓవర్లలో వికెట్లేమీ తీయలేకపోయారు... భువీ, చాహార్ బౌలింగ్ ఎదుర్కోవడానికి లంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో పెద్దగా ఇబ్బంది పడలేదు...

భువీ బౌలింగ్‌లో తేలిగ్గా బౌండరీలు బాదిన అవిష్క ఫెర్నాండో, దీపక్ చాహార్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు. ఈ ఇద్దరూ వికెట్లు తీయలేకపోవడంతో హార్ధిక్ పాండ్యాకి బాల్ అందించాడు ధావన్...

నో బాల్‌తో బౌలింగ్ మొదలెట్టిన హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో అప్పటిదాకా నెమ్మదిగా ఆడుతున్న మినోద్ భనుక రెండు బౌండరీలు బాదాడు...

పవర్ ప్లేలో ఆఖరి ఓవర్ 10వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన యజ్వేంద్ర చాహాల్, మొదటి బంతికే వికెట్ తీశాడు. చాహాల్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ఫెర్నాండో, మనీశ్ పాండేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

35 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన ఫెర్నాండో అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాజపక్ష, చాహాల్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు... దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఓ వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది శ్రీలంక.

2020 నుంచి పవర్ ప్లేలో అత్యంత దారుణమైన ప్రదర్శన ఇచ్చిన జట్టుగా టాప్‌లో నిలిచింది భారత జట్టు.

2020 నుంచి ఇప్పటిదాకా జరిగిన 9 మ్యాచుల్లో పవర్ ప్లేలో కేవలం 6 వికెట్లు మాత్రమే తీయగలిగారు భారత బౌలర్లు... సగటు ఏకంగా 123.50గా ఉంది.

6.17 ఎకానమీతో పరుగులు ఇచ్చిన భారత బౌలర్లు, జింబాబ్వే కంటే దారుణమైన ప్రదర్శన ఇవ్వడం విశేషం. శ్రీలంక 12 వికెట్లు తీసి ఈ లిస్టులో నాలుగో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ 4.45 ఎకానమీతో 13 వికెట్లు తీసి అట్టడుగున ఉంది...

2020 ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో మూడు వన్డేలు ఆడిన భారత జట్టు, ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు ఆడింది. ఇప్పుడు లంకతో సిరీస్ ఆడుతోంది...