కుదిరితే అక్తర్ రికార్డును లేపి పడేస్తా... భారత యంగ్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్ కామెంట్...
క్రికెట్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బంతిని వేసిన బౌలర్‌గా రికార్డు ఇప్పటికీ షోయబ్ అక్తర్ పేరిటే ఉంది. 2002లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 161 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేశాడు అక్తర్. 20 ఏళ్లుగా ఈ రికార్డును ఎవ్వరూ టచ్ చేయలేదు...
ఓ కొత్త ఫాస్ట్ బౌలర్ వెలుగులోకి వస్తే చాలు, 160+ కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేయమని సలహా ఇస్తూ ఉంటాడు షోయబ్ అక్తర్. తన రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేరని పరోక్షంగా తనను తాను పొగుడుకుంటూ ఉంటాడు షోయబ్ అక్తర్...
Umran Malik-Shoaib Akhtar
అయితే ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన భారత యంగ్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్, షోయబ్ అక్తర్ రికార్డును లేపి పక్కన పడేస్తానంటూ భరోసా వ్యక్తం చేస్తున్నాడు.. శ్రీలంకతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు ఉమ్రాన్ మాలిక్...
Umran Malik
‘భారత జట్టు తరుపున చక్కగా రాణించడమే నా ముందున్న ఏకైక లక్ష్యం. అయితే భారత జట్టులో సెటిల్ అయితే, కాస్త అదృష్టం కలిసి వస్తే చాలు... షోయబ్ అక్తర్ భాయ్ రికార్డును లేపేస్తా...
Image credit: PTI
అయితే ఇప్పుడైతే నా ఫోకస్ దాని పైన లేదు. మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎంత వేగంగా బౌలింగ్ చేస్తున్నామనే విషయం బౌలర్‌కి కూడా తెలీదు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎంత వేగంగా వేశామనే విషయం తెలుస్తుంది...
umran malik
మ్యాచ్ సమయంలో బాల్ ఎక్కడ వేయాలి? ఎలా వికెట్లు తీయాలనే విషయంపై మాత్రమే ఫోకస్ ఉంటుంది. నా విషయంలో మాత్రం అంతే! మిగిలిన బౌలర్లు ఎలా ఆలోచిస్తారో నాకు తెలీదు...’ అంటూ వ్యాఖ్యానించాడు భారత ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్...
Image credit: Getty
2021 సీజన్‌లో వెలుగులోకి వచ్చిన జమ్మూ కశ్మీర్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, తొలి సీజన్‌లోనే 150+ వేగంతో బౌలింగ్ వేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 2022 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా టీమ్‌లోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్, శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లోనూ ఆడబోతున్నాడు...