కోహ్లీ కెప్టెన్సీ వల్లే టీమిండియా ఓడిపోతోందనడం సిగ్గు చేటు... ఒక్కడే ఏమీ చేయలేడు...
First Published Nov 30, 2020, 5:01 PM IST
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది టీమిండియా. భారత బౌలర్లు ఘోరంగా విఫలం కావడంతో పాటు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయాలు కూడా ఫెయిల్ అయ్యాయి. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాడని తీవ్రంగా విమర్శలు వస్తున్న సమయంలో కెప్టెన్‌కి మద్ధతుగా నిలిచాడు భారత క్రికెటర్ హర్భజన్ సింగ్.

వెన్నునొప్పితో గాయపడుతున్న నవ్‌దీప్ సైనీని ఆడించడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అతను మొదటి మ్యాచ్‌లో భారీగా పరుగులు ఇచ్చినా రెండో మ్యాచ్‌లోనూ ఆడించాడు విరాట్.

బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తుంటే... ప్రత్యామ్నాయ బౌలర్ లేక తెగ ఇబ్బంది పడింది భారత జట్టు. దీనికి విరాట్ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?