- Home
- Sports
- Cricket
- వైస్ కెప్టెన్లతో పనేముంది! ఇలాంటి టైమ్‌లో రాహుల్‌ని ఆడించడం వేస్ట్.. రవిశాస్త్రి కామెంట్...
వైస్ కెప్టెన్లతో పనేముంది! ఇలాంటి టైమ్‌లో రాహుల్‌ని ఆడించడం వేస్ట్.. రవిశాస్త్రి కామెంట్...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో తొలి రెండు టెస్టులకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, మిగిలిన రెండు టెస్టులు ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది. వరుసగా ఫెయిల్ అవుతున్న కెఎల్ రాహుల్‌ని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది టీమిండియా మేనేజ్‌మెంట్...

KL Rahul-Dravid
హార్ధిక్ పాండ్యా కారణంగా వైట్ బాల్ క్రికెట్‌లో వైట్ బాల్ కెప్టెన్సీ కోల్పోయిన కెఎల్ రాహుల్, టీ20ల్లో ప్లేస్ కూడా దక్కించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు టెస్టుల్లో కూడా కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్సీ ఊడడంతో అతనికి తుది జట్టులో చోటు దక్కుతుందా? అనేది అనుమానంగా మారింది...
KL Rahul
‘టీమ్ మేనేజ్‌మెంట్ వైస్ కెప్టెన్‌ని నిర్ణయిస్తుంది. రాహుల్ ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడో అందరికీ తెలుసు. ఇలాంటి మెంటల్ పొజిషన్‌తో ఆడడం కంటే తప్పుకోవడమే కరెక్ట్ నిర్ణయం. శుబ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి అతనికి అవకాశం దక్కడం అన్ని విధాల న్యాయం...
నేను ఎప్పటి నుంచో ఒకటే నమ్ముతా... స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లకు వైస్ కెప్టెన్ అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ప్లేయర్లను ఆడించడానికి కావాలంటే కెప్టెన్‌ని కూడా కూర్బోబెట్టాల్సి ఉంటుంది...
KL Rahul
కెప్టెన్ క్రీజులో లేకపోతే ఫీల్డ్ కెప్టెన్‌గా వ్యవహరించేందుకు ఓ ప్లేయర్ కావాలి. అయితే స్వదేశంలో మ్యాచులు జరుగుతున్నప్పుడు గ్రౌండ్‌లో 11 మంది కూడా కెప్టెన్లుగా మారతారు. అదే వైస్ కెప్టెన్‌ని నియమించి, అతను సరిగా ఆడకపోతే.. తన ప్లేస్‌లో మరొకరిని ఆడించాల్సి ఉంటుంది..
వైస్ కెప్టెన్ ట్యాగ్ ఉండడం వల్ల కెఎల్ రాహుల్ తొలి రెండు టెస్టుల్లో ఆడాడు. ఆ ట్యాగ్ లేకపోతే అతని ప్లేస్‌లో శుబ్‌మన్ గిల్‌కి అవకాశం దక్కి ఉండేది. అందుకే స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లకు వైస్ కెప్టెన్లు అవసరం లేదు. విదేశాల్లో అంటే అక్కడ పరిస్థితులు వేరు..
Image credit: PTI
విదేశాల్లో బౌన్సీ పిచ్‌లపై ఆడుతున్నప్పుడు గాయాలు కావడం చాలా కామన్. అప్పుడు వైస్ కెప్టెన్లు అవసరం అవుతారు. శుబ్‌మన్ గిల్ రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్నాడు. అతనికి ఇది ఛాలెంజ్ కానుంది. ఎందుకంటే కెఎల్ రాహుల్‌ని తప్పించి, గిల్‌ని ఆడిస్తే అతనిపై ప్రెషర్ పెరుగుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి..