ఊరుకో రోహిత్... ఇలాంటి టీమ్‌తో ఇక్కడిదాకా రావడమే ఎక్కువ! ఒక్క వికెట్ తీయలేని బౌలర్లతో...
వరల్డ్‌లో రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ ఐపీఎల్. అయితే 9 ఏళ్లుగా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోతోంది భారత జట్టు. 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పరాభవం నుంచి టీమిండియా చుట్టుకున్న దరిద్రం... కెప్టెన్లు మారినా, టీమ్ ప్లేయర్లు మారినా, హెడ్ కోచ్‌లు మారినా పోవడం లేదు...
india
ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది భారత జట్టు. అయితే ఆ తర్వాతే టీమిండియాకి దరిద్రం పట్టుకుంది. మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన ధోనీ కెప్టెన్సీలో 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓడిన టీమిండియా, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లోనూ ఓడింది...
Image credit: PTI
ధోనీ కెప్టెన్సీలోనే 2016 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్ చేతుల్లో ఓడింది భారత జట్టు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓడిన భారత జట్టు, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతుల్లో పరాజయాన్ని చవి చూసింది...
India
2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత జట్టు, 2022 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లోనూ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. టీమిండియా మోస్ట్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఒక్క వికెట్ తీయలేకపోయారు...
rohit sharma
భారత సీనియర్ మోస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు యంగ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, స్పిన్నర్ అక్షర్ పటేల్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా వికెట్ తీయడంలో విఫలమయ్యారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు పవర్ ప్లేలో 60+ పరుగులు రాబట్టడంతోనే భారత ప్లేయర్లు నీరుగారిపోయారు.
ఇక మ్యాచ్ పోయినట్టేనని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయినట్టు కనిపించారు. బౌండరీ లైన్ దగ్గర ఉన్నవాళ్లు కూడా పరుగెత్తడానికి, బంతిని ఆపడానికి పెద్దగా కష్టపడలేదు, ప్రయత్నించలేదు. భారత జట్టులో కనిపించిన ఈ యాటిట్యూడ్... సగటు క్రికెట్ ఫ్యాన్‌కి ఆశ్చర్యాన్ని కలిగించింది...
జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా లేకపోయినా యజ్వేంద్ర చాహాల్ ఆడకపోయినా సెమీ ఫైనల్ వరకూ వచ్చింది భారత జట్టు. కారణం విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ చూపించిన మాస్టర్ క్లాస్ బ్యాటింగేనని సెమీ ఫైనల్ వైఫల్యం మరోసారి రుజువు చేసింది...
బౌలింగ్‌కి అనుకూలించిన పిచ్‌పై వికెట్లు తీయడం, బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం తప్ప... భారత బౌలర్లు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది లేదు. నెదర్లాండ్స్, జింబాబ్వే వంటి చిన్న టీమ్స్‌పై చెలరేగిన మన బౌలర్లు... సౌతాఫ్రికా, పాకిస్తాన్‌లపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు...
ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. టైటిల్ గెలవలేకపోయినందుకు రోహిత్ శర్మ తెగ ఫీలవుతూ కనిపించాడు. ఇలాంటి ప్లేయర్లతో ఇక్కడిదాకా రావడమే చాలా ఎక్కువని, గత ఎడిషన్ కంటే బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చామని సరిపెట్టుకోవాలని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్.