INDvsENG: మూడో వన్డేలో టీమిండియా ఆలౌట్... ఇంగ్లాండ్ జట్టు ముందు...
మొదటి రెండు వన్డేలకు విరుద్ధంగా ఆరంభం నుంచి దూకుడుగా ఆడి భారీ స్కోరు చేయాలనే టీమిండియా వ్యూహం బెడిసికొట్టింది. 48.2 ఓవర్లలో 329 పరుగులకి ఆలౌట్ అయ్యింది టీమిండియా... శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు శుభారంభం అందించినా, మిడిల్ ఆర్డర్ వైఫల్యంలో భారీ స్కోరు చేయలేకపోయింది టీమిండియా... లోయర్ ఆర్డర్‌లో పంత్, హార్ధిక్ పాండ్యా రాణించడం వల్లే ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది టీమిండియా...

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కలిసి టీమిండియాకి వన్డేల్లో 17వ సారి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు. శిఖర్ ధావన్ దూకుడుగా ఆడగా రోహిత్ శర్మ తన స్టైల్‌కి విరుద్దంగా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు...

భారత మాజీ ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ తర్వాత అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యం నమోదుచేసిన జోడిగా నిలిచాడు ధావన్, రోహిత్...

37 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులు చేసిన రోహిత్ శర్మను అదిల్ రషీద్ బౌల్డ్ చేయడంతో 103 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా.

56 బంతుల్లో 10 ఫోర్లతో 67 పరుగులు చేసిన శిఖర్ ధావన్... వన్డేల్లో 32వ హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. శిఖర్ ధావన్ కూడా అదిల్ రషీద్ బౌలింగ్‌లోనే అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

Hardik Pandya and Rishabh Pant

Hardik Pandya and Rishabh Pant

గత నాలుగు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసిన భారత సారథి విరాట్ కోహ్లీ, కీలకమైన మ్యాచ్‌లో విఫలమయ్యాడు. 10 బంతుల్లో 7 పరుగులు చేసిన కోహ్లీ, మొయిన్ ఆలీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు...

గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన కెఎల్ రాహుల్... 18 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. లియామ్ లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో మొయిన్ ఆలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు కెఎల్ రాహుల్...

ఒకానొక దశలో 103/0 స్కోరుతో పటిష్టంగా కనిపించిన టీమిండియా, 54 పరుగుల తేడాలో 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది...

భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా కలిసి టీమిండియాను ఆదుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి బౌండరీలు బాదుతూ, సింగిల్స్ తీస్తూ 99 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పారు...

62 బంతుల్లో 5 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 78 పరుగులు చేసిన రిషబ్ పంత్, సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

భారత వికెట్ కీపర్‌గా 60 ఇన్నింగ్స్‌ల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న రిషబ్ పంత్.. మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేశాడు.

44 బంతుల్లో 5 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 64 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యాను బెన్ స్టోక్స్ అవుట్ చేశాడు. 276 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది భారత జట్టు...

శార్దూల్ ఠాకూర్ 21 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 30 పరుగులు చేసి, కృనాల్ పాండ్యాతో కలిసి 45 పరుగులు జోడించి అవుట్ అయ్యాడు. కృనాల్ పాండ్యా బౌండరీలు చేయడానికి తెగ ఇబ్బంది పడ్డాడు...

34 బంతులు ఆడిన కృనాల్ పాండ్యా ఒక్క బౌండరీ లేకుండా 25 పరుగులు చేసి మార్క్ వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.. అదే ఓవర్‌లో ప్రసిద్ధ్ కృష్ణ డకౌట్ అయ్యాడు...

భువనేశ్వర్ కుమార్ 3 పరుగులు చేసి తోప్లే బౌలింగ్‌లో అవుట్ కావడంతో 329 పరుగులకి ఆలౌట్ అయ్యింది టీమిండియా...