SAW vs NZW: తజ్మిన్ బ్రిట్స్ సూపర్ సెంచరీ.. ఏరో సెలబ్రేషన్ అదిరింది !
Tazmin Brits: తజ్మిన్ బ్రిట్స్ అద్భుతమైన సెంచరీతో దక్షిణాఫ్రికా మహిళల జట్టు న్యూజిలాండ్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో తొలి విజయాన్ని నమోదు చేసింది.

SAW vs NZW: ఇండోర్‌లో న్యూజిలాండ్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం
ఇండోర్ వేదికగా సోమవారం (అక్టోబర్ 6) జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025 ఏడవ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. 232 పరుగుల లక్ష్యాన్ని కేవలం 40.5 ఓవర్లలోనే చేధించి, ప్రోటీస్ మహిళలు టోర్నమెంట్‌లో తమ తొలి విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయంలో తజ్మిన్ బ్రిట్స్ కీలక పాత్ర పోషించారు. అద్భుతమైన సెంచరీతో అదరగొట్టారు.
Tazmin Brits: తజ్మిన్ బ్రిట్స్ రికార్డు బ్రేకింగ్ సెంచరీ
34 ఏళ్ల దక్షిణాఫ్రికా ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ 87 బంతుల్లో 101 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీ సాధించారు. ఇది ఆమెకు 2025లో ఐదవ వన్డే సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీతో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన 2024లో నెలకొల్పిన క్యాలెండర్ ఇయర్ రికార్డును బద్దలుకొట్టారు. మంధన ఏడాది లో నాలుగు సెంచరీలు సాధించగా, బ్రిట్స్ ఐదు సెంచరీలతో ఆ రికార్డును అధిగమించారు.
బ్రిట్స్ కేవలం 41 ఇన్నింగ్స్‌లలోనే ఏడవ వన్డే సెంచరీ సాధించి, మహిళల క్రికెట్ చరిత్రలో వేగవంతమైన సెంచరీల రికార్డు సృష్టించారు. ఈ రికార్డును ఇంతకుముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మేగ్ లానింగ్ 44 ఇన్నింగ్స్‌లలో సాధించారు.
A superb innings from Tazmin Brits, who is simply in sublime form! 💫
A sensational century that has carried #TheProteas Women to the brink of victory. 🇿🇦👏 #Unbreakable#CWC25pic.twitter.com/TLLhlRWznY— Proteas Women (@ProteasWomenCSA) October 6, 2025
సునే లూస్‌తో బ్రిట్స్ రికార్డు భాగస్వామ్యం
బ్రిట్స్‌కు తోడుగా సునే లూస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరి మధ్య 159 పరుగుల మూడవ వికెట్ భాగస్వామ్యం దక్షిణాఫ్రికా విజయానికి పునాది వేసింది. లూస్ 114 బంతుల్లో 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ భాగస్వామ్యం మహిళల వరల్డ్ కప్ చరిత్రలో దక్షిణాఫ్రికా జట్టుకు అత్యధికమైన మూడవ వికెట్ భాగస్వామ్యంగా ఉంద.
బ్రిట్స్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఆమె ఆరంభం నుంచే దూకుడుగా ఆడి న్యూజిలాండ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. సునే లూస్ స్మార్ట్ రొటేషన్‌తో స్ట్రైక్ షేర్ చేస్తూ, మ్యాచ్‌ను పూర్తిగా దక్షిణాఫ్రికా వైపుకు తీసుకొచ్చారు.
నోన్కులులేకో ఎంలబా బౌలింగ్ మెరుపు
టాస్ గెలిచిన న్యూజిలాండ్ మహిళల జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 47.5 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ సోఫీ డివైన్ 85 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ నోన్కులులేకో ఎంలబా అద్భుతమైన బౌలింగ్ తో న్యూజిలాండ్ ను దెబ్బకొట్టారు.
నోన్కులులేకో ఎంలబా 4 వికెట్లు (4/40) తీసి ప్రోటీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆమె సోఫీ డివైన్, బ్రూక్ హాలిడే (45) వంటి కీలక ఆటగాళ్లను ఔట్ చేశారు. ఇక న్యూజిలాండ్ ఓపెనర్ సుజీ బేట్స్ తన 350వ అంతర్జాతీయ మ్యాచ్‌లో తొలి బంతికే ఔట్ అవ్వడం ఆ జట్టుకు పెద్ద దెబ్బగా మారింది.
Tazmin Brits' century celebration: తజ్మిన్ బ్రిట్స్ ఏరో సెలబ్రేషన్
తజ్మిన్ బ్రిట్స్ తన సెంచరీ పూర్తి చేసిన వెంటనే విలక్షణమైన "ఏరో సెలబ్రేషన్" చేశారు. దీని గురించి మ్యాచ్ తర్వాత ఆమె మాట్లాడుతూ.. “ఇద్దరు చిన్న పిల్లలు.. ఒకరు ఆస్ట్రేలియాలో, మరొకరు దక్షిణాఫ్రికాలో ఉన్నారు. వారు ఈ సెలబ్రేషన్ చేయమని నన్ను అడిగారు. అందుకే వారికోసమే చేశాను” అని పేర్కొన్నారు.
అలాగే ఆమె ఈ మ్యాచ్‌లో కొత్త బ్యాట్ వాడినట్లు తెలిపారు. “ఇది నా కొత్త బ్యాట్. ముందెప్పుడూ వాడలేదు. ఇప్పుడు ఇది నా లక్కీ బ్యాట్ అవుతుందనుకుంటున్నాను” అని నవ్వుతూ చెప్పారు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న బ్రిట్స్ మాట్లాడుతూ..“ఇది మాకు చాలా అవసరమైన విజయం. ఇంగ్లాండ్‌తో పరాజయం తర్వాత ఈ గెలుపు జట్టుకు నమ్మకం ఇచ్చింది” అని అన్నారు.
The moment Tazmin Brits made it 4️⃣ hundreds in her last 5️⃣ ODIs 🤩
Watch #NZvSA LIVE in your region, broadcast details here ➡️ https://t.co/MNSEqhJP29#CWC25pic.twitter.com/NfSYRjCsOY— ICC Cricket World Cup (@cricketworldcup) October 6, 2025
సౌతాఫ్రికా తర్వాతి మ్యాచ్ లో ఇండియాతో ఢీ
ఈ విజయంతో దక్షిణాఫ్రికా జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలోనుండి ఐదవ స్థానానికి ఎగబాకింది. వారి నెట్ రన్ రేట్ -3.773 నుంచి -1.424కు మెరుగుపడింది. తర్వాతి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అక్టోబర్ 9న విశాఖపట్నంలో భారత జట్టుతో తలపడనుంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు అక్టోబర్ 10న గువాహతిలో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.