- Home
- Sports
- Cricket
- ఫుల్లుగా తాగేసి ఉన్నాడు, 13వ ఫ్లోర్ బాల్కానీకి తీసుకెళ్లి... యజ్వేంద్ర చాహాల్‌కి భయానక అనుభవం...
ఫుల్లుగా తాగేసి ఉన్నాడు, 13వ ఫ్లోర్ బాల్కానీకి తీసుకెళ్లి... యజ్వేంద్ర చాహాల్‌కి భయానక అనుభవం...
ఐపీఎల్ 2022 సీజన్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ప్లేయర్ యజ్వేంద్ర చాహాల్. గత సీజన్లలో ఆర్‌సీబీకి ఆడిన చాహాల్, ఈసారి రాజస్థాన్ రాయల్స్ తరుపున అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో తనకి జరిగిన ఓ భయానక అనుభవాన్ని బయటపెట్టాడు యజ్వేంద్ర చాహాల్...

భారత జట్టు ఆడే మ్యాచుల సమయంలో ‘చాహాల్ టీవీ’ పేరుతో ఫన్నీ ఇంటర్వ్యూలు చేసే యజ్వేంద్ర చాహాల్, అందరినీ నవ్విస్తూ, ఆటపట్టిస్తూ మహా చలాకీగా ఉంటాడు...
‘నేను ఇంతవరకూ ఎవ్వరికీ ఈ విషయం చెప్పలేదు. ఇప్పుడు అందరికీ చెబుతున్నా. 2013లో నేను ముంబై ఇండియన్స్‌లో ఉన్నా. బెంగళూరులో ఆర్‌సీబీతో మ్యాచ్ ఆడాం.
ఆ మ్యాచ్ తర్వాత ఓ డెట్ టు గెదర్ పార్టీ ఉంటే వెళ్లాం. అందులో ఓ ప్లేయర్ ఫుల్లుగా తాగేసి ఉన్నాడు. అతని పేరు నేను చెప్పను కానీ ఫుల్లుగా తాగి, స్పృహ తెలియకుండా ఉన్నాడు...
నన్ను చాలా సేపు చూసిన అతను, దగ్గరికి రమ్మని పిలిచాడు. బయటికి తీసుకెళ్తానని చెప్పి, బాల్కనీకి పట్టుకెళ్లాడు. నన్ను అమాంతం పైకి లేపాడు...
నేను భయంతో అమాంతం నా చేతులతో అతన్ని పట్టేసుకున్నాడు. అయినా నాకు గ్రిప్ దొరకడం లేదు. మేం 15వ ఫ్లోర్‌లో ఉన్నాం. నా టైం అయిపోయిందని, ఇక్కడి నుంచి పడితే ప్రాణాలు పోతాయని భయంతో వణికిపోయా...
అప్పుడు మిగిలిన ప్లేయర్లు అందరూ వచ్చి అతన్ని, నన్ను లోపలికి తీసుకెళ్లారు. ఆ షాక్‌లో నేను స్పృహ కోల్పోయా. నా ముఖం మీద నీళ్లు కొట్టి లేపేదాకా లేవలేదు...
నేను తృటిలో చావు నుంచి తప్పించుకున్న సంఘటన అది. బయటికి వెళ్లినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ సంఘటన నాకు నేర్పింది...
అంతకుముందు 2011లో ఛాంపియన్స్ లీగ్ గెలిచాం. అప్పుడు నేను చెన్నై హోటల్‌లో ఉన్నా. ఆండ్రూ సైమండ్స్, జేమ్స్ ఫ్రాంకిలిన్, నేను ముగ్గురం రూమ్‌లో ఉన్నాం.
నేను ఓ బెట్ ఓడిపోయా. వెంటనే వాళ్లిద్దరూ కలిసి నా కాళ్లు, చేతులు కట్టేశారు. నువ్వు వీటిని విప్పుకోవాలి... అని చెప్పి వెళ్లిపోయారు. అయితే నా చేతులకు టేప్ చుట్టిన విషయం వాళ్లు మరిచిపోయారు...
తర్వాతి రోజు క్లీనర్ వచ్చి నన్ను చూసి, విడిపించాడు. తాగిన మత్తులో ఏం చేస్తున్నామో తెలియక అలా చేశామని వాళ్లు క్షమాపణలు చెప్పారు...’ అంటూ చెప్పుకొచ్చాడు యజ్వేంద్ర చాహాల్...