- Home
- Sports
- Cricket
- ఎవడ్రా హనుమ విహారిని టెస్టు ప్లేయర్ అన్నది... ఢాకా ప్రీమియర్ లీగ్‌లో తెలుగోడి వీరవిహారం...
ఎవడ్రా హనుమ విహారిని టెస్టు ప్లేయర్ అన్నది... ఢాకా ప్రీమియర్ లీగ్‌లో తెలుగోడి వీరవిహారం...
ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని ప్లేయర్లలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి ఒకడు. ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లకు ఆడిన హనుమ విహారిని, ఐపీఎల్‌లో గత మూడు సీజన్లుగా ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. దీనికి ప్రధాన కారణం విహారిపై టెస్టు ప్లేయర్‌గా ముద్రపడడం.

వీవీఎస్ లక్ష్మణ్ వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్న హనుమ విహారి, ఇప్పటిదాకా భారత జట్టు తరుపున 14 టెస్టు మ్యాచులు ఆడి 742 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...
Hanuma Vihari
టీమిండియా తరుపున వన్డే, టీ20 మ్యాచులు కూడా ఆడని హనుమ విహారి, ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోవడంతో ప్రస్తుతం ఢాకా ప్రీమియర్ లీగ్ 2022 టోర్నీలో ఆడుతున్నాడు..
టెస్టు ప్లేయర్‌గా గుర్తింపు పొందిన హనుమ విహారి, ఢాకా ప్రీమియర్ లీగ్‌లో వీరవిహారం చేస్తూ, క్రిస్ గేల్, ఆండ్రే రస్సెల్, కిరన్ పోలార్డ్ వంటి హిట్టర్ల స్ట్రైయిక్ రేటును మెయింటైన్ చేస్తున్నాడు...
ఢాకా ప్రీమియర్ లీగ్‌లో అబాహనీ లిమిటెడ్ తరుపున ఆడుతున్న హనుమ విహారి, షేక్ జమాల్ ధన్‌మోండీ క్లబ్ తరుపున జరిగిన మ్యాచ్‌లో 1 పరుగు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.
అయితే అంతకుముందు బ్రదర్స్ యూనియన్‌తో జరిగిన మ్యాచ్‌లో 115 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 112 పరుగులు చేసిన హనుమ విహారి అజేయ శతకంతో తన జట్టుకి విజయాన్ని అందించాడు...
మహ్మద్ స్పోర్ట్స్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 ఫోర్లతో 59 పరుగులు చేసిన హనుమ విహారి, సినేపుకర్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 పరుగులు చేశాడు... దీంతో హనుమ విహారికి అక్కడ మంచి ఫాలోయింగ్ వచ్చింది...
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 24 మ్యాచులు ఆడిన హనుమ విహారి, 23 ఇన్నింగ్స్‌లో 284 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 46 పరుగులు. బౌలింగ్‌లో 7 ఓవర్లు వేసి ఓ వికెట్ తీశాడు. ఎకానమీ 6.71 మాత్రమే...